Big Update On Telangana New Ration Cards: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రేషన్ కార్డులను త్వరలోనే జారీ చేస్తామని.. అర్హులందరికీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
cm revanth reddy on telangana caste census: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణ సర్వేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వే చేపట్టామన్నారు.
Two Day Holidays For Govt Employees: ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు దక్కింది. ఫిబ్రవరి 15వ తేదీన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా కొందరికి మాత్రమే సెలవు ప్రకటించింది.
Telangana Secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చు ఊడిపడడంతో ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు. అదృష్టావశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Telangana Ration Cards Apply In Mee Seva: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డు జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ వేదికగా మీ సేవల్లో రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
T Congress: కులగణన విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నేతలు ఇదంత తప్పుల తడక సర్వే అంటూ సొంత పార్టీ పైనే విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్షం భేటి కానుంది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కులగణన సర్వే, SC వర్గీకరణ అంశాలే అజెండాగా ప్రత్యేక శాసన సభ సమావేం జరుగనుంది.
Telangana BC Survey: స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులేస్తున్న తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కారు.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన రిపోర్ట్ రానుంది.
Liquor Prise hike: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు కిక్కు దిగే వార్త. మద్యం ధరల పెంపుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
Telangana Govt Schemes: రిపబ్లిక్ డే రోజు నాలుగు పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్స్ కింద 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూరింది. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలతో సాయం అందింది.
Telangana Govt Employees Issues: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని కొంతమంది ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి కేసులు వేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉద్యోగులకు, పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హరీష్ రావు ఎండగట్టారు.
Telangana Requests 20 Lakhs PMAY Houses To Union Govt: పేదల కోసం తమకు 20 లక్షల ఇళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మెట్రో రైలు నిర్మాణానికి సహాయం చేయాలని.. మిగత కార్యక్రమాలకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
Telangana All Time Record With Investments: సులభతర పారిశ్రామిక విధానంతో తెలంగాణ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దావోస్‌లో జరిగిన సదస్సులో హైదరాబాద్, తెలంగాణ పేరు మార్మోగడంతో భారీగాదాతలు లభించారు.
Business Ideas: బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బిజినెస్ కు హై డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి కూడా చాలా తక్కువ... రోజుకు కనీసం 10 వేలు లాభం వస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana All Time Record With Attracts 1 Lakh 3200 Crore Investments: సులభతర పారిశ్రామిక విధానం.. అన్ని వనరులు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోంది.
Amazon Web Services Rs 60000 Crore Investment In Telangana: తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా అమెజాన్ చేసుకుంది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెడుతూ అమెజాన్ సంస్థ ప్రకటించింది. అమెజాన్ పెట్టుబడులతో ఒక్కసారిగా హైదరాబాద్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Sun Petrochemicals Investment Rs 55000 Cr In Telangana: పదేళ్ల తెలంగాణ చరిత్రలో అత్యధిక భారీ పెట్టుబడి వచ్చింది. దావోస్ వేదికగా తెలంగాణకు ఒక్కరోజే రూ.55 వేల కోట్ల పెట్టుబడులు లభించాయి. తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
WEF 2025 Davos: CtrlS Invests Rs 10k Cr In Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి లభించింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఓ దిగ్గజ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ రూ.10 వేల కోట్లు ఉంది.
TS Liquor Rates: తెలంగాణలో మందు బాబులకు ప్రభుత్వం బ్యాడ్‌న్యూస్ చెప్పనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైయింది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Heavy Traffic: సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లిన హైదరాబాద్ వాసులు పండగ తర్వాత ఒక్కొక్కరిగా తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నెల 11న రెండో శనివారం, ఆదివారం, సోమ, మంగళ, బుధ వారాలు కలిసి రావడంతో చాలా మంది శుక్రవారం రాత్రే పండగ జరుపుకోవడానికి పయనమయ్యారు. పండగ పూర్తి కావడంతో ఉసురుమంటూ నగరానికి తిరిగి వస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.