Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళుతోంది. వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై మరొక బిల్లును ఇందులో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.
Ex CM KCR Public Meeting On April 27th: అధికారం కోల్పోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో విఫలమవడం నుంచి తేరుకుని కొత్త ఉత్సాహంతో సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళిక వివరించారు.
KCR: 2023 యేడాది చివర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభలో ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ కు సున్నా సీట్లు ఇచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవనం వైపు చూడని అధినేత తాజాగా ఈ రోజు తెలంగాణ భవన్ లో అడుగుపెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
KCR:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరిపినందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం హెడ్మాస్టర్ను సస్పెండ్ చేసింది. సరూర్నగర్- నందనవనం ఎంపీపీ స్కూల్ లో పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచారంటూ హెడ్మాస్టర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
Kalvakuntla Kavitha Offers To Peddagattu Jatara: తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతరలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించారు. ఆమె రాకతో పెద్దగట్టు జాతర ప్రాంగణం సందడిగా మారింది. పెద్దగట్టు ఆలయాన్ని నాటి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు.
Kalvakuntla Kavitha Fire On Chandrababu: కృష్ణా జలాలు ఏపీ దోచేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవిత డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha: అప్పనంగా చంద్రబాబు నాయుడు నీళ్లు తరలించుకుంటూ పోతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. వెంటనే ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
Telangana Politics: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచబోతోందా.. ! ఓ వైపు కేసీఆర్, మరోవైపు ఇతర నేతలంతా యాక్టివ్ కాబోతున్నారా..! ఈనెల 19న బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది.. ఈ సమావేశం తర్వాత గులాబీ కేసీఆర్.. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారా..!
When Pending Dearness Allowance And PRC Clear For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్.. రెండో పీఆర్సీ విడుదల చేయకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీల సర్కార్ అని అభివర్ణించారు.
KCR Is Four Crore Telangana Peoples Emotion: 'తెలంగాణలో కేసీఆర్ జన్మదినం పండుగలా జరుగుతోందని.. కేసీఆర్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భావోద్వేగం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్తో తెలంగాణది పేగుబంధం అని అభివర్ణించారు.
Telangana politics : కులగణనతో కాంగ్రెస్ తేనె తుట్టెను కదిపిందా..? కులగణన చేస్తే రాజకీయంగా లబ్ది పొందవచ్చుకునే కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టిందా..? కులగణన తెలంగాణ బీసీలో ఐక్యతను పెంచిందా..? పార్టీలకు అతీతంగా బీసీలు ఒక్క తాటిపైకి రాబోతున్నారా...? కులగణన చేసింది కాంగ్రెస్ ఐనా దాని ప్రభావం బీజేపీ కూడా పడిందా..? కులగణన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..? బీసీ నినాదం ఏ పార్టీనీ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ..?
Harish Rao Likely To Padayatra What Will Change Political Scenario: కంచుకోటగా ఉన్న జిల్లా.. ఏకచత్రాధిపత్యంగా ఏలిన ప్రాంతం.. ఇప్పుడు గడ్డు పరిస్థితులతోపాటు ఎంపీ స్థానాన్ని కోల్పోయిన సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాదయాత్ర చేపట్టబోతున్నారనే వార్త సంచలనం రేపుతోంది.
Back To KCR BRS Party Meeting On Feb 19th: అధికారం కోల్పోయిన 14 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారు. మళ్లీ పార్టీకి జోష్నిచ్చేలా కేసీఆర్ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగనున్నారని సమాచారం.
Kavitha fires on cm revanth reddy: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సీఎం రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సర్కారు చేస్తున్న తప్పుల్ని తాము.. పింక్ బుక్ లో ఎప్పటికప్పుడు రాసుకుంటున్నామని హెచ్చరించారు.
Kalvakuntla Kavitha Womens Day Celebrations On March 8th Here Schedule: తెలంగాణలో ఆకస్మిక పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు.
BC Meeting In Kamareddy: తెలంగాణలో బీసీ సభకు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోందా..! కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బీసీ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందా..! రాష్ట్రంలో కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభ నిర్వహిస్తున్నారా..! ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రాబోతున్నారా..!
Harish Rao: భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు జీ తెలుగు మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు జీ న్యూస్ తెలుగు ఛీఫ్ ఎడిటర్ భరత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.