PMAY Houses: తెలంగాణకు భారీగా పీఎంఏవై ఇళ్లు ఇవ్వాలని.. మెట్రో రైలు నిర్మాణానికి సహకరించాలని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విరివిగా నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మెట్రో ఫేజ్ -2ను చేపట్టాలని.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ పథకాలకు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విన్నవించారు.
పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డాటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉండడంతో రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్‌లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉండడంతో మెట్రో ఫేజ్-II కింద ఆరు కారిడార్లను గుర్తించినట్లు వివరించారు.
Also Read: PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
డీపీఆర్‌లు పూర్తయిన మొదటి ఐదు కారిడార్లకు సంబంధించి 76.4 కిలో మీటర్ల మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయమవుతుందని.. వాటిని ఆమోదించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం కింద నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఇక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా 55 కిలో మీటర్లు కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. దీనికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
మురుగు నీటి నెట్‌వర్క్ నిర్మాణానికి అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎస్ఎంపీని గుర్తించి నిధులు సమకూర్చాలని.. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి రూ.41,70 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకానికి నిధులు ఇవ్వాలని.. పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కేంద్ర మంత్రికి కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.