Asteroid Hit: హాలీవుడ్లో యుగాంతం కథాంశంపై చాలా సినిమాలు ఉన్నాయి. కానీ నిజ జీవితంలో అదే జరిగే ప్రమాదం లేకపోలేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ గ్రహ శకలం YR4 అత్యంత వేగంగా భూమ్మీదకు దూసుకొస్తోంది. భూమిని డీ కొట్టే శాతం అటూ ఇటూ అవుతోంది. నిజంగా ఢీ కొడితే పరిస్థితి ఏంటనేది అంచనాలకు అందనిదిగా ఉంది. ఇండియా సహా చాలా దేశాలు మటుమాయం అవుతాయంటున్నారు.
భూమ్మీదకు YR4 అనే గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు 2024 డిసెంబర్ నెలలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది 2032లో అంటే మరో ఏడేళ్లలో భూమిని ఢీ కొట్టవచ్చు. ఈ గ్రహ శకలం భూమిని డీ కొట్టే అవకాశాలు మొదట్లో 1.2 శాతమే ఉందని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నారు. కానీ క్రమంగా ఢీ కొట్టే అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది 2.3 శాతానికి పెరిగిందని నాసా స్పష్టం చేసింది. అందుకే ప్రపంచమంతా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. గ్రహ శకలాలతో ప్రమాదం ఎంత ఉందనేది టోరినో స్కేల్ ద్వారా లెక్కిస్తుంటారు. మొత్తం పది పాయింట్ల ప్రాతిపదికగా ప్రమాదాన్ని బట్టి ఎన్ని పాయింట్లు అనేది నిర్ణయిస్తారు. ఇప్పుడు భూమి వైపుకు దూసుకొస్తున్న YR4 గ్రహ శకలానికి టోరినో స్కేల్ ప్రకారం 3 పాయింట్లు ఇవ్వడం ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే భూమి చుట్టూ ఇప్పటి వరకూ విస్తరించిన వివిధ గ్రహ శకలాలకు జీరో పాయింట్లు ఇచ్చారు. అందుకే 3 పాయింట్లు అంటే ఆందోళన కల్గించే పరిణామంగా మారింది.
ఎందుకింత భయం, విపత్తు ఎలా ఉంటుంది
ఒకవేళ ఈ గ్రహ శకలం భూమిని ఢీ కొడితే విధ్వంసం చాలా తీవ్రంగా ఉంటుంది. 500 అణుబాంబులు ఒకేసారి పడితే ఎంతటి విధ్వంసం ఉంటుందో అంతటి తీవ్రత ఉంటుంది. ఇంకా సులభంగా అర్ధం కావాలంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమాపై జరిగిన అణు బాంబు దాడికి 500 రెట్లు ఉంటుంది. భూమిని ఢీ కొట్టే అవకాశం 2.3 లేదా 2 శాతం ఉన్నా తేలిగ్గా తీసుకునేందుకు వీల్లేదు. ఒకవేళ భూమిని ఢీ కొట్టకుండా పక్కనుంచి వెళ్తూ ఆ గ్రహ శకలం పేలినా ఇంతే తీవ్తతతో విస్పోటనం ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. అందుకే YR4 గ్రహ శకలం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఏ దేశాలు నాశనం అవుతాయి
ఒకవేళ ఈ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టినా లేదా భూమికి దగ్గరగా వచ్చి పేలినా ఆ సమయంలో భూమ్మీద ఉన్న ఏ దేశాలకు విపత్తు సంభవిస్తుందనేది శాస్త్రవేత్తలు అంచనా వేశారు. విపత్తు అంటే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. నగరాలకు నగరాలు విధ్వంసం కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చు. దురదృష్టవశాత్తూ ఈ దేశాల జాబితాలో ఇండియా కూడా ఉంది. ఈ గ్రహం శకలం భూమిని ఢీ కొడితే ఉత్తర దక్షిణ అమెరికాలు, పసిఫిక్ మహా సముద్రం, దక్షిణ ఆసియా, అరేబియా సముద్రం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం గట్టిగా ఉంటుంది. అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా, సుడాన్ నైజీరియా, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ దేశాల్లో నష్టం అధికంగా ఉంటుంది.
While still an extremely low possibility, asteroid 2024 YR4's impact probability with Earth has increased from about 1% to a 2.3% chance on Dec. 22, 2032. As we observe the asteroid more, the impact probability will become better known. More: https://t.co/VWiASTMBDi pic.twitter.com/Z1mpb4UPaC
— NASA Asteroid Watch (@AsteroidWatch) February 7, 2025
గతంలో ఎప్పుడైనా
2013లో రష్యాలోని చెల్యాబిన్క్స్ నగరం మీదుగా వెళ్తున్న ఓ ఉల్క భూ వాతావరణంలో ప్రవేశించగానే పేలిపోయింది. ఈ ఉల్క భూమికి 18 మైళ్ల ఎత్తులో పేలింది. అయినా సరే ఆ నగరంపైకి 500 కిలో టన్నులకు శక్తి విడుదలై...సమీపంలోని ఆరు నగరాల్లో 1500 మంది గాయపడ్డారు. 7200 భవనాలు దెబ్బతిన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి