Amazon Web Services: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రత్యే ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు తరలివస్తున్నాయి. తాజాగా ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ మరో భారీ పెట్టుబడితో ముందుకు వచ్చింది. దావోస్ సదస్సులో నాలుగో రోజు తెలంగాణకు ఊహించని రీతిలో భారీ పెట్టుబడి లభించింది. ఆల్‌టైమ్ రికార్డు పెట్టుబడి తెలంగాణకు వచ్చింది. రూ.60 వేల పెట్టుబడి పెడతామని అమెజాన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వంతో ప్రఖ్యాత సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం
దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సమావేశమయ్యారు. పెట్టుబడులు పెట్టడంపై చర్చలు జరిపారు.
Also Read: Telangana Investments: తెలంగాణ చరిత్రలోనే భారీ పెట్టుబడి.. దావోస్‌లో పెట్టుబడుల వరద
ఇప్పటికే హైదరాబాద్‌ను కేరాఫ్ అడ్రస్‌గా చేసుకున్న అమెజాన్ దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరించాలని నిర్ణయించింది. భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయని అమెజాన్ పేర్కొంది. తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో అమెజాన్ ఒప్పందం చేసుకోగా.. ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతంగా పని చేస్తున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణను కేంద్రంగా చేసుకోవడం విశేషం. దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్‌కు తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.