Kumari aunty performing pooja to revanth reddy photo video viral: కుమారీ ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్ట్రీట్ ఫుడ్ స్టాలో తో ఒక్కసారిగా ఫెమస్ అయిపోయారు. ఆమె మాదాపూర్‌లో ఐటీసీ కోహినూర్ సమీపంలో ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఎంతో మంది ఉద్యోగులు, వివిధ పనులు చేసుకునే వారు.. ఆమె దగ్గరకు వచ్చి తక్కువ ధరలోనే రుచికరమైన భోజనం చేసి వెళ్తుంటారు. ఆమె వెజ్, నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే తన కస్టమర్ లకు అందిస్తుంటారు. అయితే.. ఆమె చేతి వంటకం బాగా ఉండటం, తక్కువ ధరకే ఉండటంతో.. ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోయారు.
దీంతో ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ఛానెల్ లు, యూట్యూబ్ లు, అభిమానులు ఆమె స్టాల్ దగ్గరకు వచ్చారు . దీంతో గతంలో భారీగా రోడ్డుమీద ట్రాఫిక్ జాబ్ ఏర్పడింది. ఈ క్రమంలో స్టాల్ ను వెంటనే తీసేయాలని ట్రాఫిక్ పోలీసులు ఆమెకు ఆదేశాలిచ్చారు. అయితే.. ఈ విషయంపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది.
రోడ్డు పక్కన ఉన్న ఎంతోమంది హోటళ్ళు తీసేసి తన హోటల్ మాత్రం తీసేయకుండా కాపాడిన రేవంత్ రెడ్డి ఫోటోని దేవుడి గదిలో పెట్టి పూజ చేస్తున్న కుమారి ఆంటీ pic.twitter.com/ylTDDN86Ag
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2025
ఇది కాస్త సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కుమారీ ఆంటో స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ను అలానే ఉంచాలని.. ట్రాఫిక్ మాత్రం ఇబ్బంది కల్గకుండా.. ఆమెను చూసుకొవాలని ఆదేశాలిచ్చారు. దీంతో కుమారీ ఆంటీ సీఎం రేవంత్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా.. అప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసి సీఎం రేవంత్ పట్లతన అభిమానంను చాటు కుంటుంది.
అయితే.. తాజాగా.. కుమారీ ఆంటీ మరోసారి ట్రెండింగ్ గా మారింది. ఈసారి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తాను పూజించే దేవుళ్ల గదిలో పెట్టుకుంది. అంతే కాకుండా.. తన దేవుళ్లతో పాటు.. సీఎం రేవంత్ ఫోటోకు కూడా పూజలు చేసింది. తనఫుడ్ ఈరోజు ఉండేందుకు, నలుగురికి తాను ఉపాధి, తక్కువ ధరలో మంచిగా కడుపు నిండా అన్నం పెడుతున్నానంట.. దానికి రేవంత్ కారణమన్నారు. అందుకు తనకు ఆయన దైవంలాంటి వారని కూడా చెప్పారు.
ప్రతిరోజు తన దేవుళ్లతో పాటు, రేవంత్ ఫోటోకు కూడా దండం పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తానని కుమారీ ఆంటో చెప్పారు. గతంలో కుమారీ ఆంటీ ఖమ్మంలో వరదల సమయంలో 50 వేలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం కుమారీ ఆంటీ ఇంట్లో దేవుళ్లతో పాటు, సీఎం రేవంత్ ఫోటోలను పూజించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి