KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) లాంగ్ గ్యాప్ తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఏడు నెలల తర్వాత ఆయన భవన్ లో అడుగు పెట్టారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్స్‌లో ఓటమితో ఆయన ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మధ్యలో ఇంట్లో జారి పడటంతో ఆయన హాస్పిటల్ పాలయ్యారు. కొన్నేళ్ల చికిత్స తర్వాత మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పామ్ హౌస్ లో ఉంటున్న పార్టీ తరుపున కేటీఆర్, హరీశ్ రావు యాక్టివ్ గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
తాజాగా నేడు గులాబీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరై కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు తరలివచ్చారు. మొన్న బర్త్ డే తర్వాత రెండు రోజులకే కేసీఆర్ వస్తూ ఉండటంతో ఈ భేటిపై ఆసక్తి నెలకొంది. అంతేకాదు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు. .ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లాల కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. అటు కేంద్రంపై ఎలాంటి వ్యూహం అమలు చేయాలనే దానిపై కూడా కార్యచరణ రూపొందించినట్టు తెలుస్తుంది.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
చాలా నెలల తర్వాత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతూ ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతేకాదు కేసీఆర్ రాకతో పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు, ప్రజా సమస్యలపై పోరాటానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే గతంలో ప్రకటించినట్లే భారీ బహిరంగ సభతో పాటు పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేకంగా కేసీఆర్ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.