WEF 2025 Invests: పెట్టుబడుల్లో తెలంగాణ ఆల్‌ టైమ్‌ రికార్డు.. రాష్ట్రానికి రూ.1.32 లక్షల కోట్లు 

Telangana All Time Record With Attracts 1 Lakh 3200 Crore Investments: సులభతర పారిశ్రామిక విధానం.. అన్ని వనరులు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 23, 2025, 04:00 PM IST
WEF 2025 Invests: పెట్టుబడుల్లో తెలంగాణ ఆల్‌ టైమ్‌ రికార్డు.. రాష్ట్రానికి రూ.1.32 లక్షల కోట్లు 

Telangana All Time Record: పెట్టుబడుల్లో తెలంగాణ ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టిస్తోంది. పదేళ్లలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అత్యధికంగా పెట్టుబడులు ఈ ఏడాది లభిస్తున్నాయి. దావోస్‌ సదస్సు కేంద్రంగా జరుగుతున్న సదస్సులో తెలంగాణకు ఇప్పుడు దక్కిన పెట్టుబడులు రూ.1.32 లక్షల కోట్లకు చేరాయి. దీంతో తెలంగాణ ఆర్థిక వృద్ధికి ఈ పెట్టుబడులు భారీ ఊతం లభించనుంది. ఈ పెట్టుబడులతో తెలంగాణ పారిశ్రామిక రంగానికి భారీ ప్రయోజనం దక్కింది. ఈ పెట్టుబడి ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు కావడం విశేషం. మొత్తం 10 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. గతేడాదితో పోలిస్తే పెట్టుబడులు మూడింతలు మించాయి.

Also Read: Amazon Investment: మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు.. అమెజాన్ అడ్డాాగా తెలంగాణ

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు రెండో రోజు కూడా కొనసాగింది. ఈ సదస్సులో ఇప్పటికే  రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించడం విశేషం. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చిన విశేషం. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు వచ్చాయి.

Also Read: PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం

దావోస్ వేదికపై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వేసిన అడుగులు నేడు పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోంది. భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో హైదరాబాద్‌ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. సరళతర పారిశ్రామిక విధానంతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించడం విశేషం. సన్‌ పెట్రో కెమికల్స్‌, అమెజాన్‌ పెట్టుబడులతో వరుసగా మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. దాదాపు 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఇప్పటివరకు జరిగిన పెట్టుబడులు
సన్‌ పెట్రో కెమికల్స్‌: రూ.45,500 కోట్లు
అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌: రూ.60 వేల కోట్లు
మొత్తం పెట్టుబడులు: రూ.1.32 లక్షల కోట్లు
గతేడాది పెట్టుబడులు: రూ.40,232 కోట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News