Telangana Ration Cards: కొన్నేళ్లుగా రేషన్ కార్డు కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తుండగా.. చాలాకాలం తర్వాత పేదలకు రేషన్ కార్డు యోగం లభించనుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా వాటిని జారీ చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రజలకు రేషన్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త కార్డులకు సంబంధించి ఈ సందర్భంగా సీఎం పలు డిజైన్లను పరిశీలించారు.
Also Read: Harish Rao: 'డిఫెన్స్..టీ20.. ఎప్పుడు సిక్స్ కొట్టాలో కేసీఆర్‌కు బాగా తెలుసు'
రేషన్ కార్డు డిజైన్ మార్పు
గతంలో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఇచ్చే అవకాశం ఉంది. కార్డుల డిజైన్, సైజ్ మారుస్తున్నారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వ రాజముద్రతోపాటు మరికొన్ని చిత్రాలు రేషన్ కార్డుపై ఉంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రంగు మూడు రంగుల్లో ఏదైనా ఒక రంగులో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని అధికార వర్గాల ద్వారా వెల్లడవుతోంది. ప్రభుత్వం పరిశీలిస్తున్న డిజైన్లు త్వరలోనే ఒకటి ఖరారు చేసి జారీకి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఉగాదికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. ఉగాదికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు రేషన్ బియ్యంలో సన్న బియ్యం ఇస్తారనే తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.