Vishwaksen Vs YSRCP: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన విశ్వక్సేన్..

Vishwaksen Vs YSRCP: విశ్వక్ సేన్ .. వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో 30 ఇయర్స్ పృథ్వీ .. వైయస్ఆర్సీపీ తో పాటు ఆ పార్టీ 2024 ఎన్నికల్లో సాధించిన అసెంబ్లీ సీట్లపై సెటైర్స్ వేసారు. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ అంటూ వైసీపీవాళ్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కదా.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 19, 2025, 10:10 AM IST
Vishwaksen Vs YSRCP: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన విశ్వక్సేన్..

Vishwaksen Vs YSRCP: వైసీపీ వాళ్లు విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ మూవీ విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాను చూడొద్దంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. దీంతో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి.. పృథ్వీ మాటలకు సినిమాకు సంబంధం లేదంటూ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాదు తమ సినిమాను  బాయ్ కాట్ చేయోద్దంటూ వేడుకున్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదంటూ ఒకింత వేడుకోలు చేసుకున్నారు. కట్ చేస్తే ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చింది.

నెగిటివ్ వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు  చూడకుండా  విశ్వక్ సేన్ ను బిగ్ షాక్ ఇచ్చారు. ఒక రకంగా వైసీపీ వాళ్లు బాయ్ కాట్ పిలుపునిచ్చినా.. దాన్ని చూసి ఈ సినిమాను హిట్ చేయాలని మెగా, నందమూరి క్యాంప్ హీరోలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు.. ఓ రకంగా వైసీపీవాళ్ల ప్రమేయం లేకుండానే ‘లైలా’ మూవీని ప్రజలే సోదిలో లేకుండా పోయింది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

సినిమా విడుదలయ్యాకా.. బాయ్ కాట్ చేయాలన్న వైసీపీకి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా.. విశ్వక్ సేన్ సినిమాను ప్రేక్షకులే బాయ్ కాట్ చేశారు. ఓ రకంగా వైసీపీ నేతలకు పని లేకుండా ప్రజలే ఈ సినిమాను తిరస్కరించారు. ఈ రకంగా విశ్వక్ సేన్.. వైసీపీ వాళ్లకు పనిలేకుండా చేసారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా వల్గర్ అడల్ట్ కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరోవైపు విశ్వక్ సేన్ లుక్.. అమ్మాయికి తక్కువా.. హిజ్రాలకు ఎక్కువ అన్న కామెంట్స్ నుంచి వినిపించాయి. ఈ రకంగా విశ్వక్ నటను ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేసారు. మొత్తంగా విశ్వక్ సేన్ అమ్మాయి పాత్ర కోసం పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది. మొత్తంగా విశ్వక్ సేన్ కెరీర్ లోనే రూ. 1 కోటి లోపు షేర్ అందుకొని దాదాపు 90 శాతం నష్టాలతో ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News