Chhatrapati Shivaji Maharaj: రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో అదిరిన‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్..

Chhatrapati Shivaji Maharaj: హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు. దేశ వ్యాప్తంగా అందరు ఈయన జయంతిని వేడుకల చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రపై రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు శివాజీ జయంతి సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ప్యాన్ ఇండియాలో ఐదు భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 19, 2025, 11:45 AM IST
Chhatrapati Shivaji Maharaj: రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో అదిరిన‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్..

Chhatrapati Shivaji Maharaj: దేశ వ్యాప్తంగా అతిపెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ కథపై పూర్తి స్థాయి సినిమా రాలేదు. రాజకీయ నాయకులకు ఓటు బ్యాంక్ ఎలాగో.. మన హీరోలు కూడా ఓ వర్గం ప్రేక్షకులు తమకు ఎక్కడ దూరమవుతారనే టికెట్ బ్యాంక్ రాజకీయాల కారణంగా ఛత్రపతి శివాజీ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదనే కంటే ధైర్యం చేయలేదనే చెప్పాలి.  ఓ రకంగా మరాఠీలోనే శివాజీ జీవిత కథపై పూర్తి స్థాయి సినిమాలొచ్చాయి. కానీ అవి కేవలం మరాఠా ప్రజలకు మాత్రమే తెలిసిన మరాఠి భాషలో తెరకెక్కడం వలన ఎక్కువ మంది ప్రేక్షకులకు శివాజీ కథ చేరువ కాలేదు. ఇక తెలుగులో మన హీరోలైన ఎన్టీఆర్, కృష్ణ, బాలకృష్ణ వంటి వాళ్లు సినిమాలో వచ్చే ఓ దేశ భక్తి గీతంలో శివాజీ పాత్రలో కాసేపు కనిపించారు. తెలుగులో తెరకెక్కిన ‘భక్త తుకారాం’ సినిమాలో శివాజీ గణేషణ్ .. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కాసేపు అలరించారు. కానీ ఏ హీరో కూడా పూర్తి స్థాయిలో శివాజీ పాత్రలో నటించలేదు.

కానీ ‘కాంతార’తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ టైటిల్ పాత్రలో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు శివాజీ జయంతి సందర్బంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను  విడుదల చేసారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ప్రసూన్ జోషి లిరిక్స్.. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. సౌత్ డిజైనింగ్ ను రసూల్ పూకుట్టి నిర్వహిస్తున్నారు.  మొత్తంగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి మాత్రమే ముఖ్యపాత్రను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, హిందీ చిత్ర సీమకు సంబంధించిన స్టార్ నటులు ఈ సినిమాలో భాగస్వాములు కానున్నారు. భారీ కాన్వాస్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (ఛావా) జీవిత కథపై తెరకెక్కిన ఈ సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే రూ. 175 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఈ సినిమా త్వరలో రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను దాటి దాదాపు రూ. 400 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. మొత్తంగా శంభాజీ సినిమా మాదిరే శివాజీ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News