Heavy Traffic: సంక్రాంతి పండగ సందర్బంగా వరుస సెలవులు రావడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరు మధ్యలో సెలవులు పెట్టుకొని మరి ఊర్లకు వెళ్లారు. అక్కడ పండగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండగలను అంగరంగ వైభవంగా చేసుకున్నారు. అంతేకాదు పండగ సందర్భంగా కోడి పందాలు ఆడటం, గాలి పటాలు ఎగరేయడం, మధ్యలో సినిమాలు చూడటం ఇది అసలు సంక్రాంతి పండగ ఉద్దేశ్యం.
అంతేకాదు పిండి వంటలు, షడ్రుచులతో కూడిన విందు భోజనంతో ఎంజాయ్ చేసారు. దాదాపు మెజారిటీ ప్రజలు సంక్రాంతి పండగను ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్నటి కనుమతో పండగ పూర్తైయింది. దీంతో నగరం నుంచి పల్లె బాట పట్టిన ప్రజలు తిరుగు నగరానికి ప్రయాణం అవుతున్నారు.
మొత్తంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు ముగియడంతో ప్రజలు తిరిగి ఎవరి ప్రాంతాలకు వారు బయల్దేరారు. దాంతో విజయవాడ-హైదరాబాద్ రహాదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతి పండుగ ముగించుకుని నగరవాసులు తిరుగు ప్రయాణమయ్యారు. కీసర, పంతంగి టోల్ ప్లాజాల దగ్గర భారీగా వాహనాల రద్దీ ఎర్పడింది. తిరుగు ప్రయాణమయ్యేవారి సంఖ్య రెండ్రోజులపాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.