Rekha Gupta Takes Oath as New Delhi CM:దేశ రాజధాని ఢిల్లీలో కాసేపటి క్రితం రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లోని రామ్ లీలా మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ, ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రుల సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈమెతో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈశ్వరుడిపై ప్రమాణం చేసి ఈమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఆమె విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చి.. ఓ రాష్ట్రంలోని అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. విద్యార్ధి నేత నుంచి ఢిల్లీ సీఎం వరకూ రేఖాగుప్తా పోరాటం సాగింది.
27 యేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో చివరగా బీజేపీ తరుపున సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా స్వల్ప కాలం పరిపాలించారు. ఆ తర్వాత 15 యేళ్లుగా ఏక బిగిన కాంగ్రెస్ నేతృత్వంలో షీలా దీక్షిత్ పరిపాలించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. మొదటి సారి 49 రోజులు.. ఆ తర్వాత ఐదేళ్లు.. ఆ తర్వాత టర్మ్ లో అవినీతి కారణంగా ఢిల్లీ సీఎం దిగాల్సి వచ్చింది. ఆయన రాజీనామా చేయడంతో తన ప్లేస్ లో తను చెప్పినట్టు నడిచే ఆతీషి మార్లెనాను ముఖ్యమంత్రిగా చేసారు.
రేఖా గుప్తా ఢిల్లీకి నాల్గో మహిళా ముఖ్యమంత్రి.. ఈమె మొదటిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. మొత్తంగా బీజేపీ సీనియారిటీని పక్కన పెట్టి..ఓ మహిళా నేతకు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అప్పగించడం వెనక పెద్ద రాజకీయమే దాగుంది. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా అతి కొద్ది కాలం పనిచేసారు.దేశంలో ఈమె 18వ మహిళా ముఖ్యమంత్రి..
బీజేపీ తరుపున గతంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, ఉమా భారతి, ఆనందీ బెన్ పటేల్ వంటి వారు సీఎంలుగా పనిచేసారు.మొత్తంగా దేశంలో ఓ స్ట్రాటజీ ప్రకారం మహిళా సాధికారికతకు భారతీయ జనతా పార్టీ పెద్ద పీఠ వేస్తోంది.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.