Delhi Cabinet: ఎట్టకేలకు ఢిల్లీ కోటలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసింది. 27 యేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బీజేపికి చెందిన రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈమె తో పాటు మరో ఆరుగురు క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఢిల్లీ క్యాబినేట్ లో ఉన్న వాళ్లందరు అపర కుబేరులు కావడం విశేషం.
Delhi CM: ఈ గురవారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు.
Rekha Gupta Takes Oath as New Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసారు. ఢిల్లీలోని అతిరథ మహారథుల సమక్షంలో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సెనా ..రేఖా గుప్తాతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Delhi CM: తాజాగా ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పర్వేష్ వర్మను కాకుండా.. మహిళ నేత మరియు బనియా వర్గానికి చెందిన రేఖా గుప్తాను సీఎంగా నియమించడంతో షాక్ అవ్వడం పర్వేష్ వర్మ వంతు అయింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన మంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లడంతో ఢిల్లీ సీఎం ఎంపిక ఆలస్యమైంది. ఎట్టకేలకు దేశ రాజధాని పగ్గాలను ఓ మహిళ చేతిలో పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అయితే.. మొత్తంగా గత కొన్ని రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు పులిస్టాప్ పడింది. ఈ రోజు మధ్యాహ్నం రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ కు అప్పగించనున్నారు. 70 మంది శాసన సభ్యులున్న ఢిల్లీలో కేవలం సీఎంతో పాటు మరో ఆరుగురుకి మాత్రమే ఛాన్స్ ఉంది.
Delhi CM Rekha Gupta: ఎట్టకేటకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. సీఎం రేసులో మొన్నటి వరకు ఈమె పేరు అసలు వినబడలేదు. పర్వేష్ వర్మ సహా ఎంతో మంది పేర్లు ఢిల్లీ సీఎం రేసులో వినపడ్డాయి. కానీ బీజేపీ పెద్దలు మాత్రం అన్ని ఈక్వేషన్స్ తో పాటు కుల సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎట్టకేలకు రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఇంతకీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.