Telangana Jagruthi Womens Day: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని కవిత చెప్పారు. అదే వరంగల్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఇప్పటివరకు అమలు కాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గుర్తుచేశారు. 'వరంగల్ డిక్లరేషన్‌పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరు' అని పేర్కొన్నారు.
Also Read: Rahul Gandhi: సంచలనం సృష్టించిన రాహుల్ ఆకస్మిక పర్యటన.. టీ కాంగ్రెస్‌లో తుఫాన్ రానుందా?
మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'మహిళా శంఖారావం' పోస్టర్‌ను బుధవారం కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఇచ్చిన హామీల్లో విఫలమైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Beer Price Hike: బీర్ ప్రియులకు గుదిబండ.. భారీగా ధరలు పెంచిన తెలంగాణ
మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 'సోనియా, ప్రియాంకా, రాహుల్ గాంధీ వచ్చి చిలుక పలుకులు పలికారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు రూ.2,500 ఇవ్వడం లేదు' అని విమర్శించారు. 'రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారు. రూ.35 వేలను ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి' అని డిమాండ్ చేశారు.
మహిళా శంఖారావం
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన మహిళా శంఖారావం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. 'రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి. శాంతి భద్రతలు క్షీణించాయి. రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగింది. ఆడపిల్ల కళాశాలకు వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది' అని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క మతకల్లోలం జరగలేదని గుర్తుచేశారు.
భద్రత కోసం కూడా మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశారని వివరించారు. కేసీఆర్‌పై అక్కసుతో కేసీఆర్ కిట్‌లను రేవంత్ రెడ్డి నిలిపివేశారని మండిపడ్డారు. మానవత్వం లేకుండా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు
హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు
అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు
వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు -@RaoKavitha pic.twitter.com/tcT4gaupXP
— Sarita Avula (@SaritaAvula) February 12, 2025
బూటకపు హామీలతో మహిళల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చ్ 8 మహిళా దినోత్సవం రోజున చేపట్టబోయే మహిళా శంఖారావం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/wbQrd29vBu
— Telangana Jagruthi (@TJagruthi) February 12, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.