BRS Party Meeting: రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొన్నాళ్లు సమయం ఇవ్వాలని రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగనున్నారు. హామీలు ఇవ్వడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్లీ 'కేసీఆర్ పాలన'ను ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయాల్లోకి పునః ప్రవేశించనున్నారు.
Also Read: Kalvakuntla Kavitha: 'తెలంగాణలోని ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి రూ.35 వేలు ఇవ్వాలి'
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పాల్గొననున్నారు.
Also Read: Rahul Gandhi: సంచలనం సృష్టించిన రాహుల్ ఆకస్మిక పర్యటన.. టీ కాంగ్రెస్‌లో తుఫాన్ రానుందా?
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావొస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రేవంత్ రెడ్డి వైఫల్యాల మీద సమావేశంలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా గులాబీ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు.
అధికారం కోల్పోయిన జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై అందరి దృష్టి పడింది. కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారని.. కాంగ్రెస్ వైఫల్య పాలనపై పోరాడేందుకు కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని సన్నద్ధం చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి చెందినా క్షేత్రస్థాయిలో బలంగా ఉండడం.. స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పార్టీని బలోపేతం చేసే యోచనలో గులాబీ అధినేత ఉన్నారు. ఈ సమావేశంతో కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించ అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.