Govt Employees: ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, వేతన సవరణ సంఘం వంటి వాటిలో మోసం చేశారని.. ప్రభుత్వ ఉద్యోగులు నిండా మోసపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వాటిని ఎప్పుడు ఇస్తారని కేంద్ర మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన మోసాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు
కరీంనగర్‌లో బీజేపీ మండల అధ్యక్షులతో సోమవారం టీచర్ ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం.. గెలిచేందుకు వ్యూహం రచించారు. కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఏం చేశారని నిలదీశారు. అన్ని వర్గాలకు పెండింగ్‌లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోసం చేశారని విమర్శించారు.
Also Read: Schools Holiday: ఈనెల 19న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే తెలుసా?
'నిరుద్యోగులకు రూ.56 వేల నిరుద్యోగ భృతి. 2 లక్షల ఉద్యోగాల బాకీ ఉన్నారు' అని రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్ధికి రూ.5 లక్షల భరోసా కార్డు బాకీ. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ ఉన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ టీచర్ సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 4 డీఏలు బాకీ పడ్డాయని బండి సంజయ్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో వేతన సంఘం కూడా పెండింగ్‌లో ఉందని.. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు.
'ప్రతి విద్యార్థికి, కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయంబర్స్‌మెంట్ బాకీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం బాకీ. జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ ఉన్నాయి' అని రేవంత్ రెడ్డి బాకీల చిట్టా కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు. మేధావులారా బాకీల సర్కార్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండకేసి బాదండి అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేసి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.