KCR Public Meeting: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకత్వానికి ఆదేశించారు. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా కార్యాచరణను పార్టీ నాయకత్వానికి మాజీ సీఎం కేసీఆర్ వివరించారు. పార్టీ బహింగ సభతోపాటు ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించాలని చెబుతూనే.. ఏడాది మొత్తం ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని లక్ష్యం నిర్దేశించారు.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరింత ఆలస్యం?
దాదాపు ఏడు నెలల తర్వాత పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో 400మందికి పైగా నాయకులు హాజరవగా.. వారికి కేసీఆర్ మార్గ నిర్దేశకత్వం చేశారు. ఏప్రిల్ 10వ తేదీన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించాలని.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ చెప్పారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదుకు ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీల ఏర్పాటు, ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు
పార్టీ నాయకులపై ఆగ్రహం
ఈ సమావేశంలో పార్టీ నాయకులపై అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని.. సొంత నాయకులే ప్రచారం చేశారు. ఈ కారణంగానే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలా ప్రచారం చేయడం సరైనది కాదు' అని పార్టీ నాయకత్వానికి హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని గులాబీ అధినేత కేసీఆర్ సూచించారు.
ఉప ఎన్నికలు ఖాయం
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని.. తప్పక ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న ఉప ఎన్నికల్లో విజయానికి పని చేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ.. తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేయాలని చెప్పారు. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాలపాలు కాకుండా.. గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా పార్టీ శ్రేణులు పని చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.