Python Spotted Near Chandrababu House: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల భారీగా వరదలు సంభవించాయి. విజయవాడ నగరం వరదలకు ఎంతగా కుదేలయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా.. గుంటూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలో భారీ కొండ చిలువ ఒకటి హల్ చల్ చేసింది. కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో అక్కడ విష సర్పాలు, కొండ చిలువలు బైటకు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సైతం..అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించి ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు సైతం తీసుకున్నారు.
అంతే కాకుండా.. దీనిపై ఇటీవల వరదల సమయంలో సీఎం విజయవాడలో పదిరోజులకు పైగా ఉన్నారు. అక్కడ బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల్ని సైతం ముమ్మరం చేశారు . అయితే.. తాజాగా, గుంటూరులోని చంద్రబాబు అధికారిక నివాసం వద్ద భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర కొండచిలువ హల్ చల్ చేసింది. అక్కడ ఏదో జంతువును కొండ చిలువ మింగినట్లు తెలుస్తొంది. అది ఎటు కదల్లేక తెగ ఇబ్బందులు పడింది. దీంతో అక్కడున్న వారు కొండ చిలువను చూశారు. వెంటనే భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. సీఎం చంద్రబాబు నివాసం దగ్గరలో కొండ చిలువ కన్పించడంతో సెక్యురిటీ సిబ్బంది కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని భారీ కొండ చిలువను బంధించారు. దాన్ని సమీపంలోని అడవుల్లోకి తీసుకొని వెళ్లి వదిలేసినట్లు తెలుస్తొంది. దీంతో అక్కడున్న వారు ఊపిరీ పీల్చుకున్నట్లు సమాచారం.
Read more: Peddireddy Ramachandra Reddy: మాజీ సీఎం జగన్‌కు ముఖం చాటేసిన పెద్దిరెడ్డి.. అసలు కారణం ఇదేనా..!
ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇదిలా ఉండగా. . ఇటీవల ఏపీలో ఒక యువకుడు తప్పతాగి తన మెడలో పామును వేసుకున్నాడు. అంతే కాకుండా.. అది మెడలో అటు ఇటు తిరుగుతున్న కూడా అతను రెస్పాండ్ కాలేదు. అక్కడున్న వారు అతడ్ని అలర్ట్ చేశారు. చివరకు కొండ చిలువ బారి నుంచి అతడ్ని కాపాడాడు. అప్పట్లో ఈ వీడియో కూడా వార్తలలో నిలిచిన విషయం తెలసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.