Chhaava Movie: నటి స్వరభాస్కర్ చావా సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు.నటి కామెంట్స్ పై హిందు సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి.
స్వర భాస్కర్ తరచుగా ఏదో ఒక అంశంతో వివాదాల్లో ఉంటున్నారు. గతంలో ఆమె ఒక ముస్లిం వ్యక్తి ఫహద్ ను పెళ్లి చేసుకున్నారు.ఆ సమయంలో ఆమెను చాలా మంది ట్రోల్స్ చేశారు. ముస్లిం మహిళ సంప్రదాయం మాదిరిగా ఆమె దుప్పట్ట వేసుకొని మౌలానా సజ్జాద్ నోమానిని కలిశారు.
మౌలానా సజ్జాద్ నోమాని తాలిబన్ల సానుభూతి పరుడు. గతంలో ఆయన అనేక సందర్భాలలో మహిళలకు విద్యా విశయంలో కాంట్రవర్సీగా మాట్లాడారు. మహిళలు వంటింట్లోనే ఉండాలని, బుర్ఖా సంప్రదాయం గురించి మాట్లాడారు.
ఎప్పుడు మహిళలను ఎంతో మేల్కొల్పడానికి ఉపన్యాసాలు, పోస్ట్ లు పెట్టే స్వర భాస్కర్ ఇతర మతంకు చెందిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొవడం,ముస్లిం బోధకుడ్ని కూడా కలవడం అప్పట్లో పెను దుమారంగా మారింది. అయితే.. తాజాగా.. నటి ఛావా సినిమాపై కాంట్రవర్సీగా మాట్లాడారు
చావా సినిమా ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలోని ప్రతి ఒక్కసన్ని వేశం కూడా.. చాలా ఎమోషనల్గా, దేశ భక్తిని పెంపొందించేవిగాను, కన్నీళ్లు తెప్పించేవిగా ఉన్నాయి. అయితే.. ఈ సినిమాను చూసిన అభిమానులు చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మొత్తంగా ఛావా సినిమా గురించి ప్రతి చోట కూడా చర్చించుకుంటున్నారు. ఈ సినిమా చూసి ఎమోషన్ అవుతున్న వారి గురించి స్వర భాస్కర్ వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ సినిమా కథ 500 ఏళ్ల నాటిదన్నారు. అప్పుడు ఏంజరిగిందో ఎవరు చూశారని.. కల్పిత కథల ద్వారా తెరకెక్కిన సినిమా చూసి జనాలు ఎమోషనల్ అవుతుంటే విడ్డూరంగా ఉందన్నారు.
ప్రయాగ్ రాజ్ కుంభమేళలో కళ్ల ముందే అధికారుల నెగ్లీజెన్సీ వల్ల చాలా మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా ఇంకా అనేక మంది శవాల్ని బైటకు రాకుండా చేశారు. ఈ ఘటనకంటే.. చావా సినిమా ఘటనకు జనాలు రియాక్ట్ అవుతున్న తీరుచూస్తే ఇదేక్కడి మైండ్ సెట్ అని అన్పిస్తుందన్నారు. ప్రస్తుతం నటి స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దీనిపై హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి.