Schools Holiday: రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఎందుకో తెలుసా?

February 19th Schools Holiday: పాఠశాలలకు మరో సెలవు వచ్చేసింది. అన్ని పాఠశాలలకు రేపు ఫిబ్రవరి 19వ తేదీన సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు లభించడంతో విద్యార్థులకు ఇది తీపి కబురులాంటిది. విద్యా క్యాలెండర్‌లో ప్రకటించిన ఈ సెలవు ఎందుకో తెలుసుకుందాం.

1 /6

రేపు విద్యాసంస్థలకు సెలవు లభించింది. అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవును ఎప్పుడో విద్యా క్యాలెండర్‌లో ప్రకటించారు. క్యాలెండర్‌ ప్రకారం బుధవారం విద్యా సంస్థలకు సెలవు వచ్చింది.

2 /6

మరాఠా సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో ప్రభుత్వం సెలవు ఇచ్చింది. దేశంలోనే హిందూత్వ సామ్రాజ్యానికి దిక్సూచిగా  శివాజీ ఉన్నారు. మరాఠా గడ్డ పౌరుషంగా శివాజీని పరిగణిస్తారు. మరి అలాంటి శివాజీ జయంతిని అక్కడ పబ్లిక్‌ హలీడేగా ఉంది.

3 /6

మహారాష్ట్ర విద్యా సంవత్సరం క్యాలెండర్‌లోనే ఛత్రపతి శివాజీ జయంతికి సెలవు ప్రకటించారు. గతేడాది ప్రకటించిన 2024-2025 విద్యా సంవత్సరం క్యాలెండర్‌లో ఫిబ్రవరి 19వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

4 /6

శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో అధికారికంగా సెలవు ఉంది. బ్యాంకులతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉంది.

5 /6

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతిని మహారాష్ట్రలో ఒక పండుగలా చేసుకుంటున్నారు. తమ గడ్డకు ఒక ప్రతీకగా.. ధైర్య సాహసాలకు ప్రతిరూపంగా శివాజీ నిలిచారు. దేశంలో మహారాష్ట్ర గడ్డకు శివాజీ ప్రత్యేకత తీసుకువచ్చారు.

6 /6

శివాజీ జయంతి దేశవ్యాప్తంగా సంబరంగా చేసుకుంటారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో శివాజీ జయంతికి కూడా సెలవు ఉన్నాయి. అయితే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో సెలవు ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు మాత్రం సెలవు ఇవ్వలేదు.