YS Jagan Video: వైఎస్ జగన్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి.. మాజీ సీఎం ఏంచేశారంటే..?.. వీడియో వైరల్..

YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 18, 2025, 04:52 PM IST
  • జగన్ ను చూసేందకు భారీగా వచ్చిన అభిమానులు..
  • ఎమోషనల్ అయిన బాలిక..
YS Jagan Video: వైఎస్ జగన్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి.. మాజీ సీఎం ఏంచేశారంటే..?.. వీడియో వైరల్..

fan emotional seeing ys jagan in Vijayawada: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు విజయవాడ సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్ లో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు మాజీ సీఎం , వల్లభనేని వంశీతోమాట్లాడారు. అనంతరం మాజీ  సీఎం జైలుబైట మీడియా సమావేశంలో మాట్లాడారు.  ప్రభుత్వం కుట్ర పూరితంగా వల్లభనేని వంశీని ఈ కుట్రలో ఇరికించిందన్నారు.

అంతే కాకుండా..టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కేసులు పెడుతు.. భయపెట్టాలని చూస్తుందని అన్నారు. కొంత మంది పోలీసులు కూడా వైసీపీ నేతల్ని, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అధికారం ఎల్లవేళల ఒకరి చేతుల్లో ఉండదని.. వచ్చేది తమ ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన అధికారులు రిటైర్ అయిన, సప్తసముద్రాల అవతల ఉన్న కూడా వదిలేది లేదన్నారు.

 

మరొవైపు విజయవాడకు వచ్చిన జగన్ ను చూసేందుకు అభిమానులు పొటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనాలు ఉన్నారు. మరొవైపు  మాజీ సీఎంను తన కాన్వాయ్ లో వెళ్తు.. అందరిని అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఒక బాలిక వైఎస్ జగన్ చూసి ఎమోషనల్ అయ్యింది. గట్టిగా జగన్ అన్న అంటూ అరుస్తూ..  ఒక్కసారిగా నీ దగ్గరకు రావాలంటూ కేకలు వేస్తూ అరిచింది. బాలికను గమనించిన వైఎస్ జగన్ వెంటనే ప్రేమతో తన దగ్గరకు తీసుకుని ఆమెకు ముద్దు పెట్టి, బ్లెస్ చేశారు.

Read more: Ys Jagan Strong Warning: ఎవరు ఎక్కడున్నా బట్టలూడి కొడతాం...వైఎస్ జగన్ విశ్వరూపం

చిన్నారి సైతం.. జగన్ అన్నని ముద్దుపెట్టి.. ప్రేమతో సెల్ఫీ కూడా దిగింది. ప్రస్తుతం జగన్ బాలికను.. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. సదరు బాలిక మాట్లాడుతూ.. ఈ జన్మకు ఇది చాలని.. జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడు అన్ని పథకాలువచ్చేవని.. ఇప్పుడు ఏ పథకం రావడంలేదని, తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాలిక చెప్పింది. వైఎస్ జగన్ ను దగ్గరి నుంచి చూసేందుకు.. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు భారీగా పొటెత్తారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News