Baba Ram dev running race with horse video viral; బాబా రామ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెల్లవారు జామున లేచినప్పటి నుంచి ఏదో ఒక ఛానెళ్లతో తన యోగాలతో దర్శనమిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది బాబా రామ్ దేవ్ సూచించిన ఆయుర్వేదం మాత్రలు వేసుకుంటూ.. ఆయన చెప్పిన ఆసనాలు టీవీల ముందు కూర్చుని వేస్తుంటారు. నేటి యువత చాలా మంది 30 ఏళ్లు దాటగానే.. బాణ పొట్టవేసుకుని, అన్నిరకాల సమస్యలతో బాధపడుతుంటరు.
సరైన అలవాట్లు పాటించకుండా.. బైట ఫుడ్ లను ఎక్కువగా తింటూ.. శరీరంపై ఏ మాత్రం కంట్రోల్ లేని వాళ్లంతా.. ఈవిధంగా చాలా మంది చిన్నవయసులోనే లేని పోనీ రోగాల బారిన పడుతుంటారు. ఇదిలా ఉండగా.. బాబా రామ్ దేవ్ మాత్రం.. 59 ఏళ్లు వచ్చిన కూడా ఇంకా టీనేజ్ కుర్రాడిలా ఆసనాలు వేస్తుంటారు. అంతే కాకుండా.. ఆయన టీవీలలో రన్నింగ్ చేస్తు, తమ ఆసనాలను లైవ్ లో చూపిస్తుంటారు.
ఆయన వెంట్రుకలు.. నల్లగా నిగ నిగలాడుతుంటాయి. అయితే.. తాజాగా.. ఆయన ఏకంగా గుర్రంతో రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రామ్ దేవ్ బాబా.. గోచీ కట్టుకుని గుర్రం పక్కన నిల్చున్నారు. ఇంతలో మరో వ్యక్తి గుర్రం మీద ఉన్నాడు. ఇద్దరు రన్నింగ్ రేసు స్టార్ట్ చేశారు. బాబా రామ్ దేవ్ గుర్రం కన్నా.. స్పీడ్ గా తన గమ్యంను చేరుకున్నారు.
ఆతర్వాత తన శక్తికి, ఎముకలు గట్టిగా ఉండేందుకు రోజు స్వర్ణజిత్, ఇమ్యునోక్రిట్ గోల్డ్ అంటూ కూడా తన ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా నేచురల్ గా తాము.. అనేక మాత్రల్ని అందుబాటులోకి ఉంచుతున్నామన్నారు .
దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావని, దీని వల్ల శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రాంగ్ గా మారుతారనికూడా బాబా రామ్ దేవ్ చెప్పుకొచ్చారు. మొత్తంగా బాబా రామ్ దేవ్ గుర్రంతో రన్నింగ్ రేస్ లో పాల్గొనడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ వీడియో వైరల్గా మారింది.