Shivaji Maharaj Jayanti 2025: మరాఠా చక్రవర్తి, స్వరాజ్యం ను సాధించడం కోసం తన ప్రాణాలు సైతం దేశం కోసం అర్పించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని దేశ మంతట ఎంతో పండుగలా చేసుకుంటారు.
ఛత్రపతీ శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం, ధర్మస్థాపన కోసం తన ఎంతో పోరాటం చేశారు. మొఘలులను, ఎంతో మంత్రి కరుడుగట్టిన రాజుల్ని సైతం ఎదిరించి మట్టికరిపించారు. అంతే కాకుండా దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించాలని కూడా మంచి మెస్సెజ్ ను ప్రజలకు ఇచ్చారు. అలాంటి గొప్ప యోధుడి అడుగు జాడల్లో మనం అంతా నడవాలని పెద్దలు చెప్తుంటారు.
అయితే.. శివాజీ జయంతి వేళ ఆయనలో ఉన్న విధంగా ధైర్యసాహాసాలు, మంచి తనం, అన్యాయంను ఎదుర్కొనే సాహాసం, ధర్మస్థాపనకు, అధర్మంను కూకటి వేళ్లతో పేకిలి వేసేందుకు అవసరమైతే ఎంతకైన పోరాడాలని ఆయన జీవితంలోని సంఘటనల ఆధారంగా ఉన్నటువంటి కొన్నికొటేషన్ లను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్లోని శివనీర్ కోటలో జిజియాబాయ్, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. మొఘల్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తు.. 1680 ఏప్రిల్ 3న మహాకాళిలో ఐక్యమైపోయారు.
శివాజీ మహారాజ్ జయంతి రోజున మన బంధువులు, ఫ్యామిలీస్,ఫ్రెండ్స్ లకు పంపించి మరోసారి ఛత్రపతి మహారాజ్ ను తలుచుకుని ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. ఛత్రపతి మహారాజ్ వీరత్వానికి ప్రతీక, ఆయన పౌరుషం, అన్యాయంను ఎదిరించే సాహాసం మనకు ఆదర్శం.. ఇలాంటి ఒక సన్మార్గంలో వెళ్లాలని కోరుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన శుభాకాంక్షలు.
స్వరాజ్యం కోసం చిన్న వయసులోనే కత్తిని పట్టి, భీకర యుద్దాలు చేశారు శివాజీ మహారాజ్.. అందుకే జీవితంలో ఎప్పుడైన కష్టాలు వస్తే.. వాటిని చూసి భయపడకుండా.. ధైర్యంతో పొరాడి.. వాటిని ఎదుర్కొనే ధైర్యంను ఛత్రపతి నుంచి పొందాలని మీకు శివాజీ మహారాజ్ జన్మదిన శుభాకాంక్షలు.
జిజియా బాయ్ ముద్దుల కుమారుడు. అపర పరాక్రమ వంతుడు. హిందు సామ్రాజ్యం నిర్మించిన భరతమాత వీరపుత్రుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంత్రి వేళ శుభాకాంక్షలు. ఆయన నవతరానికి నాందీ లాంటి వాడు.
ధైర్యసాహాసాలకు మారు రూపం.. ఎత్తుకు పైఎత్తు వేసే అపర చాణక్యుడు.. హిందు ధర్మం కాపాడిన దురంధరుడు, పరాయిలకు సింహాస్వప్నం అయిన శివాజీ మహారాజ్ ఆశీర్వాదాలు మీకు ఉండాలని కోరుకుంటూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంత్రి శుభాకాంక్షలు.
అణువణువున ధైర్యం, పరాయిల గడపలో ఉన్న మొక్కవోనీ ధైర్యం, అపర రాజకీయ దురంధరుడు, ధీశాలీ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశీస్సులు మీకు ఉండాలని.. ఆయన మార్గంలో మనం అంతా నడిచే విధంగా మనలో మంచి సంకల్పం ఆయన కల్గించాలని కోరుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంత్రి శుభాకాంక్షలు.