four people travel hundreds of kilometres by boat kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఎలాగైన పుణ్యస్నానాలు ఆచరించాలని చాలా మంది భక్తులు భావిస్తున్నారు . దీని కోసం మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. దాదాపు.. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా కుంభమేళలో ప్రతిరోజు కూడా భక్తులు రద్దీ పెరుగుతుంది.
ఇప్పటి వరకు కూడా.. 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మరో షాహీ స్నానం ఫిబ్రవరి 26న జరగనుంది. ఈ తేదీ వరకు ఇంకా భక్తులు వస్తారని యూపీ సర్కారు భావిస్తుంది. బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహానాల్లో కుంభమేళకు భక్తులు వస్తున్నారు.
ఎక్కడ చూసిన కూడా కుంభమేళ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే.. ప్రస్తుతం కుంభమేళలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొంత మంది యువత వెరైటీ గా ఆలోచించారు. నలుగురు యువకులు రోడ్డు మార్గం వదిలి, నది గుండా పడవలో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు.
Read more: Viral Video: పెళ్లి బరాత్‌లో ఘోరం.. గుర్రం మీదే విగత జీవిగా మారిన వరుడు.. షాకింగ్ వీడియో వైరల్..
వీరంతా బక్సర్ నుంచి 248 కిలోమీటర్ల దూరం మోటార్ పడవలో ప్రయాణించి ప్రయాగ్‌రాజ్ చేరుకుని స్నానం చేశారు. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్ లు కూడా షాక్ అవుతున్నారు. మరోవైపు కుంభమేళలో భక్తులకు యోగి సర్కారు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు చేపట్టింది.
ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తుంది. అయిన కూడా కోట్లాదిగా భక్తులు రావడంతో కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తొంది. మొత్తంగా ఎంతకష్టపడిన కూడా కుంభమేళకు వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేయాలని చాలా మంది భక్తులు ఆసక్తిని చూపిస్తున్నారు.