Heavy Rainfall Alert in Telugu: ఓ వైపు వేసవి ప్రభావం కన్పిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. మరో వైపు బంగాళాఖాతంలో తుపాను ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఈ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది. భారీ వర్షాలు పడనున్నాయి.
వేసవి సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఉపరితలంలో తుపాను ఆవర్తనం ఏర్పడి..ఈశాన్య దిశగా కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతం మీదుగా తుపాను గాలులు వీయనున్నాయి. దాంతో రానున్న వారం రోజులు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పర్వత ప్రాంతాల్లో హిమపాతం భారీగా కురవనుంది. బంగాళాఖాతంలో తుపాను గాలుల కారణంగా అస్సోం , నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు ఉత్తరాంచల్, జార్ఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఫిబ్రవరి 21 వరకూ పరిస్థితి తీవ్రంగా ఉండి ఆ తరువాత మోస్తరు వర్షాలు పడవచ్చు.
ఫిబ్రవరి 21 వరకూ ఈశాన్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులోనే తుపాను గాలులు వీచే అవకాశముంది. దాంతో ఆ రోజు వరకూ ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన అస్సోం, మేఘాలయలో భారీ వర్షాలు పడవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో తేలికపాటి వర్షపాతం, భారీగా మంచు ఉండవచ్చు. ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకూ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాతాల్లో భారీ వర్ష సూచన ఉంది. మొత్తం 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
ఫిబ్రవరి 24 తరువాత ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడిమి అధికమౌతోంది.
Also read: Rythu Bharosa: రైతన్నలకు శుభవార్త, ఎక్కౌంట్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి