Ibomma Telugu Movies: సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. సినిమా విడుదలైనా వెంటనే ఆన్‌లైన్‌లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో థియేటర్ ప్రింట్స్ వస్తుండగా.. ఇటీవల మాత్రం ఏకంగా HD ప్రింట్స్‌నే పెడుతున్నారు. దీంతో నిర్మాతలకు భారీ నష్టం చేకూరుతోంది. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని సినీ ప్రియులు కోరుతున్నారు.
ఇప్పటికే టికెట్ ధరలు, ఓటీటీల కారణంగా థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. పైరసీ కారణంగా ఇంకా తగ్గిపోతుంది.
నాగచైతన్య తండేల్ మూవీ ఇటీవల థియేటర్స్‌లోకి వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మధ్యాహ్నానికే HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.
అంతేకాదు ఓ లోకల్ ఛానెల్‌లో, ఆర్టీసీ బస్సులో తండేల్ మూవీని ప్రదర్శించడం కలకలం రేపింది. దీనిపై మూవీ టీమ్ కూడా సీరియస్ అయింది. తండేల్ మూవీని ఎక్కడైనా ప్రదర్శిస్తే తమకు సమాచారం ఇవ్వాలని.. మూవీని డౌన్‌లోడ్ చేసుకుని చూసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని నిర్మాత బన్నీ వాసు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇందుకు సంబంధించి ఓ మీమ్ వైరల్ అవుతోంది. పుష్ఫలో అల్లు అర్జున్ పిక్ పెట్టి.. 'Ibomma అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్' అనే డైలాగ్ పెట్టారు.
ఈ మీమ్‌ను పోస్ట్ చేసి.. "మరీ టు మచ్ గా.. ఇలా HD ప్రింట్ రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదు రా అయ్యా.. నిర్మాతలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు.. ఏదైనా తేడా వస్తే.. వాళ్ల ఫ్యామిలీస్ రోడ్ మీదకి వచ్చేస్తాయి.. పైరసీ ప్రింట్‌లను ప్రోత్సహించకండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.