Bank Holiday: రేపు బ్యాంకులు బంద్.. ఫిబ్రవరి 19న ఆర్‌బీఐ సెలవు ఎందుకు ప్రకటించింది తెలుసా?

February 19 Bank Holiday: రేపు బుధవారం బ్యాంకులు బంద్ ఉంటాయి.  ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ప్రకటన జారీ చేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఎందుకు రేపు బ్యాంకులు బంద్ ఉంటాయి. బుధవారం 19వ తేదీ అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయని ఆర్‌బీఐ  అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఇవే..
 

1 /5

బుధవారం ఫిబ్రవరి 19వ తేదీ అన్ని బ్యాంకులకు బంద్‌ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో కూడా బ్యాంకులు సెలవు ఉందా? లేదా పనిచేస్తాయని సందేహం ఉందా? రేపు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  

2 /5

ఫిబ్రవరి 19వ తేదీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అన్ని పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు ఈ ఫిబ్రవరి 19వ తేదీ సెలవు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.  

3 /5

సాధారణంగా అన్ని బ్యాంకులు పండుగలు, స్థానిక వేడుకలు లేదా ప్రముఖుల జయంతి సందర్భంగా అన్ని ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. కానీ మొదటి, మూడో, ఐదవ శనివారాలు వస్తే బ్యాంకులు పనిచేస్తాయి. 2025 ఫిబ్రవరి నెలలో మొత్తం కేవలం 14 రోజుల ముందు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.  

4 /5

ఫిబ్రవరి 19 బుధవారం ముఖ్యంగా బేలాపూర్, ముంబై, నాగపూర్ ప్రాంతాల్లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీ ఐజ్వల్, ఈటా నగర్ లో కూడా స్టేట్ డే సందర్భంగా సెలవు ప్రకటించింది ఆర్‌బీఐ.  

5 /5

ఇది కాకుండా ఫిబ్రవరి 26వ తేదీ కూడా బ్యాంకుకు సెలవు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు రానుంది. మహా శివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, జైపూర్, జమ్మూ, కొచ్చి, లక్నో, ముంబై, నాగపూర్, రాంచి, శ్రీనగర్, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు ఉంది.