Samantha Love: సమంత తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత షేర్ చేసిన ఫోటో అందుకు ఇచ్చిన క్యాప్షన్ కాస్త చర్చనీయాంశం అయింది. ఆమె తాజా క్యాప్షన్ వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు.
సెలెబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత భావాలను పంచుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా, ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన తాజా ఫోటోలతో పాటు సెలెనా గోమెజ్ పాట నుండి ఒక క్రిప్టిక్ క్యాప్షన్ షేర్ చేశారు.
ఫిబ్రవరి 16న సమంత తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె క్యాప్షన్‌గా సెలెనా గోమెజ్ ఇటీవల విడుదల చేసిన Scared of Loving You(నిన్ను ప్రేమించాలంటే భయమేస్తోంది) పాట నుండి లిరిక్స్ పేర్కొన్నారు. "If I lose my shit, promise not to laugh / If I throw a fit and get photographed / Would you take my side? Would you hold my hand?" అంటూ సమంత తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి ఆమె #lyricsforlife, #SelenaGomez అనే హ్యాష్‌ట్యాగ్‌లు జోడించారు.
దీని అర్థం ఏమనగా.. నువ్వు నా పక్కనే ఉంటావా..? ఎల్లప్పుడూ నా చెయ్యి పట్టుకొనే ఉంటావా..? ఇక ఇంతలా ఎమోషన్ క్యాప్షన్ సమంత షేర్ చేయగ ఆమె అభిమానులు.. దీనిబట్టే సమంత ప్రేమలో ఎంతగా బాధపడింది విషయం తెలుస్తోంది అని అంటున్నారు. ఈ ఫోటోల్లో సమంత తెల్లని డ్రెస్ ధరించి అందంగా కనిపించారు. ఆమె పొడవైన టాస్సెల్ స్కర్ట్ ధరించి, దానిపై పచ్చటి బెల్ట్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు.
ఇటీవల సమంత.. డైరెక్టర్ రాజ్ నిధిమోరు తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన క్యాప్షన్ చర్చనీయాంశంగా మారింది.
సమంత గతంలో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటించారు. అయితే, ఆమె మయోసిటిస్ అనారోగ్య సమస్య కారణంగా కెరీర్‌కు స్వల్ప విరామం తీసుకున్నారు. 2024లో ఆమె సిటాడెల్: హనీ బన్నీ వెబ్‌సిరీస్‌లో వరుణ్ ధావన్ తో కలిసి నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం, సమంత రక్త బ్రహ్మాండ అనే ఫాంటసీ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌లో అలి ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్, వామిఖా గబ్బి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.