Kesineni Nani Re Entry in Politics: 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని సొంత తమ్ముడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత అనూహ్యంగా పార్టీకు రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలపై స్వయంగా కేశినేని నాని స్పందించారు.
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిద్దామనుకున్నారు. కానీ అనూహ్యంతో తమ్ముడి చేతిలో ఓడిపోయి రాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే గత కొద్ది రోజులుగా కేశినేని నాని తిరిగి రాజకీయాల్లో వస్తారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరవచ్చనే టాక్ విన్పిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో సంప్రదింపులు జరిగినట్టు కూడా వార్తలొచ్చాయి. గడ్కరీపై రెండు మూడు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. ఇంకొందరైతే మళ్లీ వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. ఈ క్రమంలో కేశినేని నాని స్వయంగా స్పష్టత ఇచ్చారు.
గత ఏడాది జూన్ 10వ తేదీన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా అధికారికంగా చేసిన ప్రకటనలో మార్పు లేదని కేశినేని నాని స్పష్టం చేశారు. ప్రజాసేవ కొనసాగుతుందని, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజాసేవ అనేది జీవితాంతం కులమతాలకు అతీతంగా ఉంటుదన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. రాజకీయ పునరాగమనంపై వస్తున్నవార్తలన్నీ నిరాధారమైనవని తేల్చిచెప్పారు. తన రాజకీయ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పార్లమెంట్, ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు నిరంతరం ప్రయత్నిస్తానన్నారు. ప్రజాసేవకు ఏ రాజకీయ పార్టీ పదవితో సంబంధం లేదన్నారు.
Also read: Delhi Earth Quake: ఢిల్లీలో భూకంపం, భయంకర శబ్దం..మరోసారి వచ్చే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి