Rythu Bharosa Online Status Check: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న ఆర్థిక చేయూత తెలంగాణ రైతు భరోసా పథకం. ఇందులో అర్హులైన ప్రతి రైతుకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. అయితే 2025 జనవరి 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. వీటితోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు జారీ కూడా ప్రారంభించింది. అయితే, ఆన్లైన్లో రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది..
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు ఆన్లైన్ లో స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కల్పించారు. కొన్ని సింపుల్ స్టెప్స్ పాటిస్తూ రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.. వ్యవసాయ రంగం అభివృద్ధికి చేయూతగా తెలంగాణ ప్రభుత్వం 17 లక్షల మందికి పైగా రైతు భరోసా పథకం అమలు చేసింది. వీరికి ప్రతి ఏడాది రూ. 12000 ఎకరానికి అందిస్తోంది. అర్హులైన ప్రతి రైతు ఈ లబ్ధి పొందనున్నాడు.
వీరికి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులను క్రెడిట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ జోక్యం లేకుండా సులభతరం ఈ పథకం అమలు చేస్తున్నారు. అయితే రైతు భరోసా డబ్బులు 2 దశల్లో విడుదల చేస్తారు. మొదట విడత రూ.6000 రబీ, రెండో విడత ఖరీఫ్ సీజన్లో మరో రూ.6000 జమా చేయనున్నారు.
తెలంగాణ రైతు భరోసా ఆన్లైన్ లో స్టేటస్ చెక్ చేసుకునే విధానం.. ముందుగా Rythubharosa,telangana.in అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి . ఆ తరువాత వెబ్సైట్ కార్నర్లో కుడి వైపున ఉన్న లాగిన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసి ఓటిపి తో వెరిఫై చేయాలి.
ఆ తర్వాత పేమెంట్ స్టేటస్ లేదా బెనిఫిషరీ లిస్ట్ సెక్షన్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ రైతు భరోసా స్టేటస్ మీ స్క్రీన్ ముందు కనిపిస్తుంది.
ఈ పథకానికి అర్హులు కావాలంటే శాశ్వత తెలంగాణ నివాసి అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే రైతు వయస్సు 18 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉండాలి. వారి పేరుపై భూమి కలిగి ఉండాలి, తగిన ధృవపత్రాలు కూడా ఖచ్చితంగా ఉండాలి.