Sai Pallavi Kiss Video: అందరి ముందే సాయిపల్లవికి ముద్దుపెట్టిన అభిమాని.. షాక్‌లో నేచురల్ బ్యూటీ.. వీడియో వైరల్..

Thandel movie jathara event: తండేల్ మూవీ జాతర కార్యక్రమం కొన్నిరోజులు క్రితం గ్రాండ్ గా జరిగింది. అయితే..ఈ ప్రొగ్రామ్ లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 17, 2025, 12:49 PM IST
  • తండేల్ జాతరలో అనుకొని ఘటన..
  • సాయిపల్లవికి కిస్ పెట్టిన ఫ్యాన్..
Sai Pallavi Kiss Video: అందరి ముందే సాయిపల్లవికి ముద్దుపెట్టిన అభిమాని.. షాక్‌లో నేచురల్ బ్యూటీ.. వీడియో వైరల్..

Fan kisses sai Pallavi in thandel jathara event: తండేల్ మూవీ ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డులను షేక్ చేస్తుంది. ఇప్పటికే వంద కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ మూవీ మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసే వైపుగా దూసుకుపోతుంది. ఈమూవీలో సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరు కూడా ఒకర్ని మించి, మరోకరు అద్భుతంగా నటించారని అభిమానులు ఫిదా అవుతున్నారు. చందు మొండేటీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

అయితే.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చైతుకు ఈ మూవీ మంచి హైప్ ఇచ్చిందని అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఎవరి నోట విన్న, ఎక్కడ చూసిన తండేల్ టాక్ మాత్రమే విన్పిస్తుంది. ఈ క్రమంలో తండేల్ మూవీ రిలీజ్ కు ముందు తండేల్ జాతర ఈవెంట్ గ్రాండ్ గా జరింది. ఈ కార్యక్రమంలో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

తండేల్ సినిమా జాతర కార్యక్రమంలో ఒక మహిళ అభిమాని స్టేజీ దగ్గర అందర్ని దాటుకుంటూ సాయిపల్లవి దగ్గరకు వెళ్లింది. అంతేకాకుండా.. సాయిపల్లవితో మాట్లాడింది.  నేచురల్ బ్యూటీ ఆమెతో ప్రేమతో మాట్లాడింది. చివరకు షేక్ హ్యాండ్ ఇచ్చింది.  

ఇంతలో లేడీ ఫ్యాన్.. సాయి పల్లవి చేతిని పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టేసుకుంది. ఈ పరిణామంలో సాయి పల్లవి కాస్తంతా షాక్ అయ్యింది.  మరల అభిమానిని చూసి నవ్వుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొందరు సాయి పల్లవిని రజనీకాంత్ తో పోలుస్తు ఈ వీడియోను భాషాతో కనెక్ట్ చేశారు.

Read more: Chhaava Movie: హిస్టారికల్ మూవీ చావాను మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?.. షాక్ అవ్వడం పక్కా..

భాష సినిమాలో రజనీకాంత్ ను అభిమానులు చేతి మీద ముద్దులు పెడుతారు. ఇప్పుడు సాయిపల్లవిని కూడా అభిమాని అదే విధంగా కిస్ ఇచ్చారని అభిమానులు ఆ సీన్ ను దీనికి కనెక్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News