Rythu Bharosa Amount: రైతు భరోసా డబ్బులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన రైతులకు డబ్బులు విడుదల చేయాలని స్పష్టం చేసింది. మార్చ్ మొదటి వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసాపై అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. చాలామంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నా ఇంకా డబ్బులు రాకపోవడంతో విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన ప్రకటన జారీ చేసింది. అర్హులైన రైతన్నల ఖాతాల్లో మార్చ్ మొదటి వారంలోగా రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసింది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ అంశంపైనే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ మూడు ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతు భరోసా అందిందని, కొత్త పాస్ పుస్తకాల బ్యాంక్ ఎక్కౌంట్ల పరిశీలన జరుగుతోందని మంత్రులు తెలిపారు.
మొదటి విడతలో 2 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులకు 6 వేల రూపాయలు, రెండో విడతలో 2 ఎకరాల భూమి ఉన్నవారికి 12 వేలు జమ కావల్సి ఉంది. వీరిలో కొందరికి ఇప్పటికే డబ్బులు జమ కాగా ఇంకా చాలామందికి రావల్సి ఉంది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన అందరికీ మార్చ్ మొదటి వారం నాటికి రైతు భరోసా డబ్బుల పంపిణీ పూర్తవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నాలుగైదు ఎకరాల భూమి ఉన్నవారికి కూడా మూడు ఎకరాల వరకూ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎవరైనా రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలకు సహాయం అందుతుంది. 5 ఎకరాల భూమి ఉన్నవారికి కూడా 3 ఎకరాల వరకు ఆర్ధిక సహాయం లభిస్తుంది. కొందరికి అందడం, కొందరికి అందకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తమకు ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం అందరికీ డబ్బులు అందుతాయని చెబుతోంది.
Also read: Hydra Warning: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో ఆ భూములు కొనవద్దు, హైడ్రా హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి