CM Chandrababu Naidu Vs YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ కొలువుదీరి తొమ్మిది నెలలు కావొస్తోంది..! ఈ తొమ్మిది నెలల పాలనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఒకరిద్దరూ మంత్రులు తప్పితే.. మిగతా మంత్రులంతా సైలెంట్ మోడ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్, ఇతర నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నా.. మంత్రులు మాత్రం నోరు మెదపడం లేదు. వైసీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారంతా భావిస్తున్నారా. లేక సీఎం చంద్రబాబును తిడుతుంటే.. మనకెందుకులే అని ఊరుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కొందరు మాత్రమే యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. మిగతా మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులకు మార్కులిచ్చిన అధినేత.. కొందరు మంత్రుల పనితీరును మార్చుకోవాలని ఆదేశించారు. కానీ మంత్రుల పనితీరు మాత్రం మారడం లేదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే విషయంలోనూ మంత్రులు ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి కేవలం ఫించన్ల కోసమే దాదాపు 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫించన్ల కింద పంచింది కేవలం 23 వేల కోట్లు మాత్రమే.. ఈ విషయాన్ని ప్రజలకు వివరించడంలో సగానికి పైగా మంత్రులు విఫలమయ్యారని పార్టీలో చర్చ జరుగుతోందట.
ఇక్కడే మరో వాదన వినిపిస్తోంది.. ఇంతకీ కూటమి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదట. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్ని వేల ఖర్చు చేయబోతోంది. ఇంకా అనేక పథకాలు అమలులోకి తీసుకురాబోతున్నారు. అవన్నీ అమలు చేస్తే ప్రభుత్వానికి తిరుగుండదని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఈ విషయాలను ప్రజలకు వివరించడంలో మంత్రులు మౌనరాగం వినిపిస్తుండటంపై సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ మంత్రులకు ప్రభుత్వం నుంచి సమాచారం రావడం లేదా.. లేక ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ముందే గుర్తించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని టాక్ వినిపిస్తోంది..
ఇక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా.. పయ్యావుల కేశవ్ చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం అయన మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ససేమీరా అంటున్నారట. మరోవైపు మరో కీలక మంత్రి వంగలపూడి అనితది ఇదే పరిస్థితి. హోంమంత్రిగా చార్జ్ తీసుకున్న సమయంలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ తర్వాత ఆమె సైలెంట్ మోడ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. మరో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఇతరు మంత్రులంతా మౌనంగా ఉంటున్నారు. ఇక మంత్రి అచ్చెన్నాయుడు ఇంతకుముందు ఉన్న స్పీడ్‌ను ఇప్పుడు చూపించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి నారాయణ రాజధాని అంశం తప్పితే.. ఇతర విషయాలను అస్సలు ప్రస్తావించడం లేదు..
ఇదిలా ఉంటే మరికొందరు మంత్రుల పనితీరు భేష్‌గా ఉందట. ప్రస్తుతం జలవనరులశాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామనాయుడు పనితీరు బాగుందట. ఇక మంత్రి అగనాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయులు, కొలుసు పార్థసారథి వంటి నేతలు తమ శాఖలపై పట్టు సాధించారట. కానీ మిగతా మంత్రులు మాత్రం మమ అన్నట్టుగా వాళ్ల పనితీరు ఉందని చర్చ జరుగుతోంది. అసలు ఏ మంత్రి.. ఏశాఖకు ప్రతినిధ్యం వహిస్తున్నారో ప్రజలకు కూడా తెలియదని ప్రచారం సాగుతోంది. అయితే మంత్రుల వద్ద పీఆర్‌వోలు మంత్రులకు సమాచారం ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కూటమి సర్కార్ మెరుగైన పనితీరును కనబరుస్తున్నా.. చేసింది చెప్పుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. రెప్పపాటులో ఘోర ప్రమాదం నుంచి బైటపడ్డ బుడ్డొడు..
Also Read: One Nation One Gold Rate: గోల్డ్ రేట్స్ ను కంట్రోల్ చేసేందుకు మాస్టర్ ప్లాన్..అదేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter