rjd chief lalu prasad Yadav on Maha kumbh controversy comments: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ప్రతిరోజు కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు 50కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళలో మరో షాహీ స్నానం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నేపథ్యంలో కుంభమేళలో త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.
కుంభమేలలో ప్రతిరోజు వస్తున్న సంఖ్య మాత్రం తగ్గడంలేదని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో కుంభమేళ కోసం ఇటీవల ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా ట్రైన్ లను నడిపిస్తుంది. వందే భారత్ ట్రైన్ లను సైతం కుంభమేళకు మార్గలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
#WATCH | Stampede at New Delhi Railway Station | Patna, Bihar: Former Union Railway Minister and RJD Chief Lalu Prasad Yadav says, "The incident is very unfortunate and I offer my condolences to the victims. This is a mismanagement by the Railway that led to the loss of so many… pic.twitter.com/83icLBvtSm
— ANI (@ANI) February 16, 2025
ఇదిలా ఉండగా.. ఇటీవల ఢిల్లీలో రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది.ముఖ్యంగా కుంభమేళలకు వెళ్లే భక్తులు ప్లాట్ ఫామ్ మీదకు భారీ ఎత్తున చేరుకొవడం, రైల్వే అనౌన్స్ మెంట్ లో తప్పిదాల వల్ల ప్రస్తుతం ఈ దారుణం జరిగిందని అక్కడి వాళ్లు చెప్తున్నారు. మరొవైపు ఈ తొక్కిసలాటలో 18 మంది చనిపొగా.. మరో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై తాజాగా, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ చేసి వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన ఘటన విషాదకరమన్నారు. కుంభమేళ మీద మీరు ఏమంటారు... అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. కుంభమేళ.. కుంభ్ ఏంటీ.. అంతా ఫాల్తూ.. అంటూ కాంట్రవర్సీగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై బీజేపీ , హిందు సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్జేడీ చీఫ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన మహా కుంభ్ లో పుణ్యస్నానాలకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తున్నారని, అలాంటి గొప్ప ఉత్సవంను.. లాలు ప్రసాద్ యాదవ్ ఈ విధంగా అవమానించే విధంగా మాట్లాడంపై సీరియస్ అవుతున్నారు. మొత్తంగా ఆర్జేడీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter