Revanth Reddy UTurn: తెలంగాణలో సినీ పరిశ్రమ కష్టాలు ఎదుర్కొంటోంది. రేవంత్ తీరుతో చిత్ర పరిశ్రమ అభాసుపాలవుతోంది. తాజాగా రేవంత్ రెడ్డి మరో యూటర్న్ తీసుకోవడం సంచలనం రేపుతోంది. అసెంబ్లీలో ఆర్భాటంగా మాట్లాడి మాట తప్పిన రేవంత్ రెడ్డి మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఈ పరిణామంతో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నెగటివ్ టాక్‌తో వెళ్తున్న ఈ సినిమాకు రేవంత్ నిర్ణయం తీవ్రంగా దెబ్బతీసింది. గేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన టికెట్ ధరల పెంపు.. ప్రత్యేక షోలను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read: Liquor: మందుబాబులకు బంపర్ వార్త.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు
తెలంగాణలో ఇకపై సినిమా టికెట్ ధరల పెంపు.. ప్రత్యేక షోలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.చగేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన వెసులుబాటును ఉపసంరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమకు ఒక భారీ షాక్ తగిలింది. హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు.
Also Read: Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం న్యాయపోరాటం
హైకోర్టు ఆదేశాల మేరకు గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి లేదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం.. భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వమని ప్రకటించింది. తాజా పరిణామంతో తెలంగాణలో గేమ్ ఛేంజర్‌కు ఇబ్బందులు తప్పదు. ఇప్పటికే ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో నిర్మాత దిల్ రాజుకు భారీగా నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డితో చిక్కులు
సినీ పరిశ్రమతో రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. పుష్ప 2 సందర్భంగా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలు ఉండవని అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా గేమ్ ఛేంజర్‌కు మాట తప్పారు. ఈ సినిమాకు అదనపు షో, టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ యూటర్న్ తీసుకున్న రేవంత్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా నిర్ణయంతో రేవంత్ రెడ్డి మరో యూటర్న్ తీసుకోగా.. ఈ పరిణామాలతో తెలంగాణలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.