Tirumala Vaikunta Ekadashi: ఈ నెల 10న పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమల సామాన్య భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లతో పాటు భక్తుల భద్రతతో పాటు..తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
జీవితంలో ఒక్కసారైన వైకుంఠ ద్వారా దర్శనం కోసం భక్తులు తిరుపతికి పోటెత్తుతుంటారు. తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు తిరుమల కొండపై 4 కౌంటర్లు ఉన్నాయి. మత్తంగా తిరుమల తిరుపతితో కలిపి మొత్తంగా 91 కౌంటర్లలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకెన్లు మంజూరు చేస్తారు.
ముఖ్యంగా తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే విధంగా తదుపరి మిగిలిన రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకన్లు ఇష్యూ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.
సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను టీటీడీ రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అదే విధంగా చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమలకు రావాలని సూచిస్తోంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.