Calf flesh in hanuman temple in tappachabutra: హైదరబాద్ లో ఇటీవల ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో దాడుల ఘటన పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నగర వ్యాప్తంగా తరచుగా ఎక్కడో ఒక దగ్గర గుడుల మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తునే ఉన్నారు. దసర నవరాత్రుల్లో సైతం నాంపల్లిలోని దుర్గామాత విగ్రహాంను కొంత మంది ధ్వంసం చేశారు.
శంషాబాద్ సమీపంలో నవగ్రహా ఆలయం, అమ్మవారి ఆలయంలో కొంతమంది విగ్రహాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఇటీవల ఒక ఆలయంలో దగ్గర పేలుడు సంభవించి, ఆలయ పూజారీ తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా తరచుగా గుళ్లనే టార్గెట్ చేసుకున్నారా.. అన్న విధంగా అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా.. హైదరాబాద్ లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
#Hyderabad---
Tension prevailed for a while at #Tappachabutra on Wednesday after some persons allegedly threw pieces of #meat in a #temple.
After noticing pieces of flesh within the temple premises, the priest of #Hanuman temple alerted the committee members who informed to… pic.twitter.com/G8JSlZx81g
— NewsMeter (@NewsMeter_In) February 12, 2025
హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు మాంసం ముద్దల్ని పడేశారు. అది ఏకంగా హనుమాన్ ఆలయంలోని శివలింగం సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఉదయం ఆలయం తెరిచి చూసిన పూజారీ గుడిలో మాంసం ముద్దలు ఉండటం చూసి ఆలయం సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్నారు.
విషయం తెలిసి హిందు సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ఆలయంలో మాంసం ముద్దల ఘటనపై సీరియస్ అయ్యారు. దీని వెనుకాల ఉన్న వారిని కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై గోషా మహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.
ఈఘటనకు కారణమైన వారిని కఠినంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో కొంత మంది రెండు వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేసేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం టప్పా చబుత్రాలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. ఘటన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter