Samantha: నాగచైతన్య, శోభితకి.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత..!

Naga Chaitanya comments: ఇటీవల తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య సమంత విడిపోవడానికి.. కారణం శోభిత అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ సమంతతో విడిపోవడానికి అసలు కారణం శోభితా కాదు అంటూ శోభితకు అండగా నిలిచారు నాగచైతన్య. 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత తాజాగా తన మాజీ భర్త చేసిన కామెంట్లను ఉద్దేశించి,  సద్గురు చేసిన కామెంట్లను పోస్ట్ రూపంలో పంచుకుంది. తాజాగా షేర్ చేసిన ఈ కొటేషన్ పలు అనుమానాలకు దారితీస్తోందని చెప్పవచ్చు. 

2 /5

తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ లో.. మానవుడిగా, మీరు ఒక జీవి కాదు. మీరు ఒక అవతరణ, ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. ఏదీ స్థిరంగా ఉండదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు అని ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పిన కొటేషన్ ను సమంత షేర్ చేసింది.   

3 /5

ఇకపోతే ఇది చూసినా అభిమానులు సమంత మళ్లీ నాగచైతన్య కి కౌంటర్ ఇచ్చేలా ఈ పోస్ట్ పెట్టిందని కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే , తాజాగా  తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రా టాక్స్ విత్ వికే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ నేను సమంత విడాకులు తీసుకున్నప్పుడు ప్రజలందరూ నన్ను ఎందుకు నేరస్తుడిగా భావిస్తారు అంటూ ప్రశ్నించారు. ఇక మేమిద్దరం మా జీవితాలను ముందుకు తీసుకువెళ్లాము. అందులో భాగంగానే నేను శోభితలో ప్రేమను కనుగొన్నాను. నా మునుపటి వివాహం పట్ల నాకు గౌరవం ఉంది.  శోభితాలో ప్రేమ కనిపించింది అంటూ మాజీ భార్యపై అలాగే ప్రస్తుత భార్యపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నాగచైతన్య. 

4 /5

ఇక ఇదే సమయంలో.. తాను సమంత నుంచి విడిపోయినప్పుడు తన ప్రస్తుత భార్య ప్రముఖ నటి శోభిత ధూళిపాలను ప్రజలు తిట్టడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. సమంత నుండి తాను విడాకులు తీసుకున్నప్పుడు శోభిత కారణమని అందరూ భావించారు. విడాకుల తర్వాత సోషల్ మీడియా ద్వారా శోభితతో మా బంధం చాలా సహజంగా అభివృద్ధి చెందింది. నా మునుపటి వివాహ, విడాకులకు శోభితకి ఎటువంటి సంబంధం లేదు.   

5 /5

ఇలాంటి ఎన్నో విమర్శలు వచ్చినా ఆమె ధైర్యంగా నిలబడి నిజమైన హీరో అనిపించుకుంది అంటూ తన ప్రస్తుత భార్యపై ప్రశంసలు కురిపించారు నాగచైతన్య. ఇక ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా దానికి రీకౌంటర్ గానే సమంత పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.