WhatsApp Governance: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌? ఇకపై అన్నీ వాట్సప్‌లోనే!

Movie Ticket Railway Ticket All Services In AP WhatsApp Governance: ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌తో అరచేతిలోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 11, 2025, 06:36 PM IST
WhatsApp Governance: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు బంద్‌? ఇకపై అన్నీ వాట్సప్‌లోనే!

Mana Mitra WhatsApp: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌరులకు సేవలను అర చేతిలో అందిస్తోంది. విప్లవాత్మకంగా తీసుకువచ్చిన వాట్సప్‌ గవర్నెన్స్‌ విజయవంతంగా అమలవుతోంది. వాట్సప్‌ గవర్నెన్స్‌లో మరిన్ని సేవలు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అన్ని సేవ‌లూ వాట్సాప్‌లోనే క‌ల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తిరుమల సేవలతోపాటు బస్సు, రైళ్ల సేవలను కూడా వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పొందేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎవరూ కూడా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే పని లేకుండా వాట్సప్‌ ద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Also Read: Tirumala Services: భక్తులకు భారీ శుభవార్త.. వాట్సప్‌తో తిరుమల టికెట్లు

రాబోయే రోజుల్లో ప‌నుల కోసం ప్ర‌జ‌లు కార్యాల‌యాల‌కు రావాల్సిన అవ‌స‌రం ఉండ‌దు అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'అన్ని సేవ‌లూ వాట్సాప్‌లోనే క‌ల్పిస్తామని ప్రకటించారు. యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడండి. ప్ర‌భుత్వ శాఖ‌లు  స‌ర్వ‌ర్‌ కెపాసిటీ పెంచుకోవాలి. ఈ దిశ‌గా అన్ని శాఖ‌లు త‌మ బ్యాక్ ఎండ్ మెకానిజం స‌మ‌ర్థ‌వంతంగా ఉండేలా చూసుకోవాలి' అని అధికారులకు ఆదేశించారు. వారం రోజుల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 2.64 ల‌క్ష‌ల లావాదేవీలు జరిగాయని వెల్లించారు.

Also Read: Maha Shivaratri Gift: శ్రీశైలం భక్తులకు భారీ గిఫ్ట్‌.. టోల్‌గేట్‌ ఎత్తివేత, ఉచితంగా లడ్డూ

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై మంగళవారం మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌దస్సలో ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు అధికారులకు ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు చేశారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో ప్ర‌స్తుతం ఇస్తున్న 161 సేవ‌లను పెంచాలని సూచించారు. రాబోయే 45 రోజుల్లో 500 సేవ‌లు క‌ల్పించే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని చెప్పారు. ప్ర‌భుత్వానికి సంబంధించిన అన్ని సేవ‌లు కూడా వాట్సాప్‌లోనే ప్ర‌జ‌లు పొందేలా అధికార యంత్రాంగం స‌న్నధం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్ర‌భుత్వం నుంచి ఏదైనా ఒక బిల్లు రాలేదంటే ప్ర‌జ‌లు దాన్ని స్కాన్ చేసి లేదా దాని వివ‌రాల‌ను వాట్సాప్‌లో పొందుప‌రిస్తే దాన్ని ప‌రిశీలించి మ‌నం క్లియ‌ర్ చేసేంత స్థాయికి తీసుకెళ్లాలని నిర్దేశించారు.

కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పౌరులు పొందే స‌దుపాయం క‌ల్పిస్తామ‌ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సినిమా టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా పొందే స‌దుపాయం క‌ల్పించే అంశం కూడా ప‌రిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ఎక్క‌డా ఎలాంటి లోపాల‌కు తావివ్వ‌కుండా ప్ర‌తి శాఖ కూడా సైబ‌ర్ సెక్యూరిటీ ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్రారంభమైన వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా కేవ‌లం వారం రోజుల్లోపే 2,64,555 లావాదేవీలు జ‌రిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News