JEE Main 2025 Results: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఫలితాల కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకుని స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీ, ఎన్ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ రెండు పరీక్షల్ని నిర్వహిస్తుంటుంది. ఇందులో జేఈఈ మెయిన్స్ రెండు సెషన్లలో ఉంటుంది. ఈ రెండింటిలో ఎందులో అర్హత సాధించినా అడ్వాన్స్ రాసేందుకు వీలుంటుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష పత్రంలో వచ్చిన 12 ప్రశ్నల్ని తొలగిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. దాంతో ఆ 12 ప్రశ్నలకు పూర్తి మార్కులు పడనున్నాయి. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పరీక్షలు జనవరిలో ముగిశాయి. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ప్రస్తుతం సెషన్ 2 కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఉత్తీర్ఘులైన అభ్యర్ధులు మే నెలలో జరిగే జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల నుంచి 2.5 లక్షలమందిని అడ్వాన్స్‌కు ఎంపిక చేస్తారు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు jeemain.nta.nic.in. లో కాస్సేపట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సైట్ ఓపెన్ చేశాక వ్యూ స్కోర్ కార్డ్ లేదా వ్యూ జేఈఈ మెయిన్ 2025 రిజల్ట్ క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే చాలు మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. మీ స్కోర్ కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also read: Renu Desai Fired: ఆ ఇడియట్‌కు దూరంగా ఉండండి, రేణు దేశాయ్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి