Chilukuru Balaji Temple: చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడిని ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు ఖండించాయి. ఇది రంగరాజన్‌పై వ్యక్తిగతంగా జరిగిన దాడిగా చూడకూడదన్నారు. అర్చక దేవాలయ వ్యవస్థలు, మొత్తం హిందూ సమాజంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. ధర్మం ముసుగులో స్వార్థపూరితంగా వ్యవహరించేవారు ఈ పని చేశారని మండిపడ్డారు. ఇటువంటి సంఘ విద్రోహుల్ని పట్టుకొని చట్ట ప్రకారం విచారించాలన్నారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్ట రాజుగోపాల్ అన్నారు. ఈ ఘటనపై అన్ని రాజకీయ పార్టీల కీలక నేతలు ఆయనను పరామర్శిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి కేసులో అరుగురిని అరెస్ట్ చేసినట్టు రాజేంద్రనగర్ డీసీపీ ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలు సహ నలుగురు యువకులు ఉన్నారు. వీరంతా ఖమ్మం, నిజామాబాద్ కు చెందిన వారీగా డీసీపీ తెలిపారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రంగరాజన్ అయ్యగారికి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై సీఎం ఆరా తీశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
మరోవైపు చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన 8 గంటల సమయంలో 25 మంది రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు తెలిపారు. రామరాజ్యం ఆర్మీకి ఆర్థిక సాయం చేయాలంటూ డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్‌ను కేటీఆర్ పరామర్శించారు. కోస్గిలో రైతు దీక్షకు వెళ్తున్న కేటీఆర్ మార్గ మధ్యలో చిలుకూరులో ఆగారు. ఇటీవల రంగరాజన్‌పై దాడి నేపథ్యంలో ఆయనను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇతర నేతలు ఉన్నారు. అటు కేంద్ర మంత్రి బీజేపీ అగ్ర నేత బండి సంజయ్ రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించారు. అవసరమైతే కేంద్రం తరుపున సెక్యూరిటీ అరెంజ్ చేస్తామన్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.