Nacharam Pilgrims died returning from kumbh mela: పవిత్రమైన ప్రయాగ్ రాజ్ కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు కుంభమేళకు భారీగా తరలివెళ్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో ఎలాగైన వెళ్లాలని భక్తులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బస్సుల్లో, ట్రైన్ లలో, విమానాల్లో, ప్రైవేటు వాహానాల్లో కుంభమేళకు వెళ్తున్నారు. ఇప్పటికే కుంభమేళ చుట్టుపక్కల 300 కి. మీల మేర ట్రాఫిక్ జాబ్ అయ్యింది.
ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా దీన్ని చెప్తున్నారు. అయితే హైదరాబాద్ నాచారం నుంచి కుంభమేళకు 25 మంది వరకు భక్తులు మిని బస్సుల్లో వెళ్లారు. వీరంత కుంభమేళ నుంచి.. తిరిగి వస్తుండగా.. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఒక లారీ సిమెంట్ సంచులతో రాంగ్ రూట్ లో వచ్చి... వీళ్ల మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారిపోయింది.
మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఏడుగురు మృతి
మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH-30పై మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టిన లారీ
ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి… pic.twitter.com/zPlAyLQq5U
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025
ఈ రోడ్డు ప్రమాదం.. ఈ రోజు ఉదయం జబల్ పూర్ లోని సిహోరాలో చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు గాయపడిన వారిని సిహోరా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఏడుగురు చనిపోయినట్లు గుర్తించారు.మరో 16 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. మినీ బస్సు నెంబర్ చూసి తొలుత ఏపీకి చెందిన బస్సు అనుకున్నారు.
కానీ ఘటన స్థలంలో వీరి ఆధార్ కార్డులతో హైదరాబాద్ లోని నాచారంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గాయపడిన వారికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter