February 12th School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త. బిజీ బిజీ స్కూల్ హోంవర్క్, అసైన్మెంట్స్తో నిత్యం నీరసించిపోయే విద్యార్థులకు స్కూల్ హాలిడేస్ కాస్త ఊరటనిస్తాయి. ప్రతి ఆదివారం స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని పండుగలు, ప్రత్యేక రోజుల్లో కూడా స్కూళ్లకు సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి 12వ తేదీ అంటే రేపు కూడా స్కూళ్లకు సెలవు రానుంది. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
విద్యార్థులు మరోసారి పండుగ చేసుకునే వార్త వీక్ మధ్యలో మరోసారి రేపు ఫిబ్రవరి 12వ తేదీన స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో విద్యార్థులు పండుగ చేసుకుంటున్నారు.
నిత్యం స్కూళ్లు, ట్యూషన్, హోంవర్క్లతో బిజీ అయిపోయే విద్యార్థులకు అప్పుడప్పుడు వచ్చే ఈ సెలవులు భారీ ఊరటనిస్తాయి. ఈ సమయంలో వారు కాస్త ఎక్కడికైనా బయటకు వెళ్లడానికి కూడా సమయం దొరికుతుంది.
ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఈ రోజు మాఘపౌర్ణమి కూడా. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు 'రవిదాస్ జయంతి' సందర్భంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్ అధికారిక నోటిపికేషన్ కూడా విడుదల చేశారు.
ఇక ఫిబ్రవరి 14వ తేదీ హైదరాబాద్లోని కొన్ని మైనారిటీ స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఎందుకంటే ఆరోజు 'షబ్ ఏ బరాత్' సందర్భంగా స్కూళ్లకు సెలవు రానుంది. ఇది కాకుండా ఈనెలలో 'మహాశివరాత్రి' కూడా రానుంది. ఆరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆ మరుసటి రోజు కూడా సెలవు ఉంది. ఈనేపథ్యంలో వరుసగా రెండు రోజులు 26, 27 తేదీలు శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు సంతోషంగా ఫీలావుతున్నారు.
సంత్ రవిదాస్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించారు. మాఘమాసం పౌర్ణమి రోజు ఆయన జన్మదినం జరుపుతారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేద మాఘపౌర్ణమి రానుంది. ఆయన ఎన్నో రచనలు చేశాడు. దేశానికి ఐక్యత సందేశాన్ని కూడా ఇచ్చారు.