Govt Holiday: విద్యాసంస్థలకు మరో ఒక రోజు సెలవు లభించే అవకాశం ఉంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సెలవు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వీరి విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దేశంలోనే హిందూత్వ సామ్రాజ్యానికి దిక్సుచిగా ఉన్న శివాజీ జయంతిని సెలవు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో మరికొంత మంది డిమాండ్ చేసే అవకాశం ఉంది.
Also Read: Harish Rao PA Arrest: తెలంగాణలో కీలక పరిణామం.. హరీశ్ రావు పీఏ అరెస్ట్
శివాజీ జయంతికి సెలవు ప్రకటించాలి
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి హిందువు చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలని తెలిపారు.
19వ తేదీన సెలవు?
శివాజీ జయంతి సందర్భంగా 100 చోట్ల శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుసంధానం చేస్తూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు సీడీ చవాన్ తెలిపారు. మెజార్టీ వర్గం హిందువుల మనోభావాలను అనుకూలంగా చత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి 19వ తేదీన సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శివాజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. శివాజీపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read: Govt Holiday: రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఉత్తర్వులు వెలువరించిన ప్రభుత్వం
అధికారికంగా ప్రకటించే అవకాశం?
తెలంగాణ ప్రభుత్వం శివాజీ జయంతి సందర్భంగా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో అధికారికంగా సెలవు ఉండగా.. అదే తెలంగాణలో కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. శివాజీ జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ ప్రభుత్వ విద్యా సంస్థలతోపాటు ఉద్యోగులకు కూడా సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా కూడా సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ జయంతికి కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సెలవు ఇస్తే మాత్రం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పండుగ లాంటి వార్త.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.