My Auto Is Safe: ప్రయాణికుల సురక్షిత, భద్రత కోసం జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖా ఆధ్వర్యంలో జిల్లాలోని ఆటో రిక్షాల సర్వీసెస్‌ను మెరుగుపరిచేందుకు MY AUTO IS SAFE పేరుతో క్యూ ఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టారు. జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ క్యూ ఆర్ కోడ్‌ను ఆటో రిక్షాలకు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జగిత్యాల పట్టణంలో సుమారు 1,500 ఆటోలకు ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా స్టిక్కరింగ్ చేయడం జరిగిందని, రాబోవు కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆటోకు కూడా ఈ స్టిక్కరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు “MY AUTO IS SAFE” అనే స్టిక్కరింగ్ ఉందా? అని గమనించాలని అన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ మీతో అసభ్యంగా ప్రవర్తించిన, దురుసుగా మాట్లాడిన, మరేయితర సమస్యలు ఎదుర్కొన్న మీరు ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ సీట్ వెనకాల గల QR కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే అట్టి ఆటో డ్రైవర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్‌లో కనిపిస్తుందన్నారు.
ఆ తర్వాత వాటితో పాటు ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ కంప్లైంట్ చేసే ఆప్షన్ సదుపాయాన్ని కూడా లభిస్తుందన్నారు. ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కి వెళ్లే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం వెళ్తుందని, తద్వార స్పందించి వాహనం యెక్క లైవ్ లొకేషన్‌కి చేరుకుంటారని ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ “MY AUTO IS SAFE” స్టిక్కరింగ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఆటో డ్రైవర్లకు అందించడం జరిగింది. స్వయంగా ఆటోలో కూర్చొని QR కోడ్‌ను స్కాన్ చేసిన అనంతరం వివరాలను తెలియజేశారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన,ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు అన్నారు.
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ.. ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని తెలిపారు. పరిమితి మించి ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం నేరం అని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు పడితే వాహనాలు సీజ్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, RTO శ్రీనివాస్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, రూరల్ సీఐ కృష్ణ రెడ్డి,QR CODE అప్ రుపకర్త రమేష్ రెడ్డి , RI వేణు, ట్రాఫిక్ ఎస్. ఐ మల్లేశం, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఓనర్స్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.