Gold Price Decline: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. తగ్గేదేలే అంటూ లక్షకు చేరువవుతోంది. సామాన్యుడే కాదు మద్య తరగతి ప్రజలైనా బంగారం కొనగలరా అనేది ప్రశ్నగా మారింది. అదే సమయంలో మార్కెట్ నిపుణులు ఎగిరి గంతేసే వార్త అందిచారు. ఇది వెంటే ఎవరైనా సరే ఆనందంతో ఉబ్పితబ్బిబ్బవాల్సిందే. ఆ వివరాలు మీ కోసం.
బంగారంష వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76 వేలు పలుకుతుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 87 వేలు దాటేసింది. ఈ పరిస్థితుల్లో బంగారం అసలు కొనగలరా అనేది ప్రశ్నార్ధకమౌతోంది.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రెండు కీలక అంశాల్లో భారీ ఉపశమనం కల్గించారు. అందులో ఒకటి 12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ లేకపోవడం, రెండవది బంగారం, వెండిపై కస్టమ డ్యూటీ గణనీయంగా తగ్గించడం
ఈ ప్రకటనతో పసిడి ప్రియులకు గ్రేట్ రిలీఫ్ కలిగింది. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అంటే ఏకంగా 9 శాతం తగ్గింది. ఫలితంగా ఏప్రిల్ తరువాత బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. మార్కెట్ నిపుణులు అంచనాల ప్రకారం ఏప్రిల్ తరువాత బంగారం ధర 10 గ్రాములు 50 వేలకు పడిపోవచ్చని తెలుస్తోంది.
చాలామంది ఏప్రిల్ వరకూ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కొత్త బడ్జెట్ విధి విధానాలు, నిర్ణయాలు అమల్లో వచ్చేది వచ్చే ఆర్ధిక సంవత్సరం 2025-26 నుంచి. అంటే ఏప్రిల్ 1 నుంచి. అందుకే ఎవరైనా బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ తరువాత కొనుగోలు చేయడం మంచిది.
దేశంలో లిక్విడిటీ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడైతే తగ్గిస్తారో వ్యాపారులు బంగారం, వెండి భారీగా దిగుమతి చేసుకుంటారు. అక్రమ బంగారం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ధరలు భారీగా తగ్గుతాయి