YSR Congress Party: అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరికలు జరుగుతుండడంతో ఆ పార్టీ జోష్‌లోకి వస్తోంది. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ పార్టీలో చేరడంతో జోష్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీకి మరో బూస్ట్ రానుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోదరుడు వైసీపీ కండువా వేసుకోనున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ పరిణామం టీడీపీతోపాటు మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు భారీ షాక్ తగలనుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా అతడి చేరిక ఉండనుండడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. 4 రోజులు 'సనాతన ధర్మ పరిరక్షణ' యాత్ర
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలు ఉండనున్నాయని తెలుస్తోంది. వైసీపీలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కుమారుడు గాలి జగదీశ్ చేరనున్నారని తెలుస్తోంది. నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌కు జగదీశ్ తమ్ముడు కావడం గమనార్హం. తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో బుధవారం జగదీశ్ చేరిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో జగదీశ్ చేరనుండడంతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారనున్నాయి.
Also Read: Vidadala Rajini: ఎమ్మెల్యే ప్రత్తిపాటికి, అధికారులకు విడదల రజిని మాస్ వార్నింగ్
రోజాకు చెక్
వైఎస్సార్‌సీపీలో గాలి జగదీశ్ చేరనున్నారనే వార్త చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అతడి చేరికతో మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు చెక్ పెట్టేందుకు నగరి నియోజకవర్గంలో గాలి జగదీశ్‌ను చేర్చుకుంటున్నారనే పుకార్లు వస్తున్నాయి. రోజాను నియంత్రించడం కోసం జగదీశ్‌ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరపైకి తీసుకువచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
నగరిలో రోజాకు గడ్డు రోజులు
చిత్తూరు జిల్లాలో తన పలుకుబడి కొనసాగేలా పెద్దిరెడ్డి సరికొత్త వ్యూహం నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డితో ఆమెకు పొసగలేదు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అనే తీరున రాజకీయాలు కొనసాగాయి. అయితే రోజా ఎమ్మెల్యేగా ఓడిపోవడం వెనుక పెద్దిరెడ్డి పాత్ర కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓడిపోయిన రోజాను నగరి నియోజకవర్గం నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగమే గాలి జగదీశ్ వైసీపీలో చేరిక అని తెలుస్తోంది. మరి వాస్తవం ఏమిటో కొన్ని రోజుల్లో తెలియనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter