Kiran Royal illegal Affairs: జనసేన నేత కిరణ్ రాయల్ భాగోతాలు, త్వరలో సస్పెన్షన్ వేటు

Kiran Royal illegal Affairs: జనసేన పార్టీ తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలల వ్యవహారాలు ఒక్కొక్కటికీ బయటకు వస్తున్నాయి. పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లడంతో జనసేన అధినేత వనన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అసలు ఈ కిరణ్ రాయల్ ఎవరు..నేపధ్యమేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2025, 09:31 AM IST
Kiran Royal illegal Affairs: జనసేన నేత కిరణ్ రాయల్ భాగోతాలు, త్వరలో సస్పెన్షన్ వేటు

Kiran Royal illegal Affairs: మహిళల జీవితాలతో ఆడుకుంటూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్‌పై జనసేనాని చర్యలు తీసుకున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టిన కిరణ్ రాయల్‌పై త్వరలో సస్పెన్షన్ వేటు పడనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

జనసేన పార్టీ తిరుపతి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు బయటపడుతున్నాయి. తన జీవితం నాశనం చేసి 1.20 కోట్లు కాజేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియోతో మొత్తం వ్యవహారం బయటికొచ్చింది. పార్టీలోని మరో ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి పార్టీ పదవులు ఎరగా చూపి లోబర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా విచారణకు ఆదేశించి అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. త్వరలో అతనిపై సస్పెన్షన్ వేటు పడనుందని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీకు చెందిన ముఖ్య నేతలు కూడా కిరణ్ రాయల్ అక్రమాలపై కచ్చితమైన ఆధారాలతో పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

కిరణ్ రాయల్ నేపధ్యమేంటి

బతుకు తెరువు కోసం తిరుపతికి 25 ఏళ్ల క్రితం వలస వచ్చిన కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ గ్రూప్ థియేటర్స్‌లో చిరంజీవి సినిమా టికెట్లన బ్లాక్‌లో విక్రయించసాగాడు. ఆ క్రమంలోనే మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆర్ధికంగా స్థిరపడేందుకు రైల్వే స్టేషన్ ఎదురుగా కిళ్లీ కొట్టు పెట్టుకున్నాడు. ఇక అక్కడ్ని నుంచి డ్రగ్స్ విక్రయాలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా చిరంజీవి దృష్టిలో పడ్డాడు. ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రాధాన్యత దక్కించుకుని ఆ తరువాత జనసేనలో చేరాడు. తిరుమల సిఫార్సు లేఖల్ని సైతం అమ్ముకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుపతి టికెట్ అరణి శ్రీనివాసులుకు దక్కడంతో గో బ్యాక్ అరణి అంటూ ఊరంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఎన్నికల అనంతరం తిరిగి అదే అరణి శ్రీనివాసులతో సన్నిహితంగా ఉండసాగాడు. చివరికి ఇప్పుడు రాసలీలల వ్యవహారంతో అక్రమ భాగోతాలు తెరపైకి వచ్చాయి. 

Also read: Tirumala: తిరుమల భక్తులకు అలెర్ట్.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News