Weather Today: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో , ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Dana Effect In AP And Telangana: దానా తుఫాను ఎఫెక్ట్‌తో ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో తుఫాను ప్రభావం భారీగానే ఉండనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను ఆయా రాష్ట్రాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, మూడు రోజులపాటు తెలంగాణ వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
Three Days Rains In Telangana: తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
Telangana Rains Updates: మొన్నటి వరకూ భారీ ఉష్ణోగ్రతలతో అల్లాడిన తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉపరితల ద్రోణి కారణంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రానున్న మూడ్రోజుల వాతావరణంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Rain: కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల ప్రభావానికి సామాన్య జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎండకు భయపడి ప్రజలు బైటకు వెళ్లేందుకు కూడా ధైర్యం చేయట్లేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
Rain Alert: భగభగమండే ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంపై పూర్తి వివరాలు మీ కోసం..
Telangana Weather Update: తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి గాలులు దక్షిణ, నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు పొడివారణం ఉంటుందని తెలుస్తోంది. అనేక చోట్ల ఉష్ణోగ్రతలుకూడా క్రమంగా పెరుతాయని సమాచారం.
IMD Issued RED Alert to Telangana: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరో రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Telangana Rains: ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే వాతావరణ శాఖ ఈ రోజు పిడుగులాంటి వార్తను వెల్లడించింది.
Telangana cold temperatures will Increase for the next five days. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు సంభవించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
గత వారం ఉత్తర తెలంగాణలో భారీగా కురిసిన వర్షాలు ఇప్పుడు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్నాయి. నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. పలుచోట్ల కాలనీల్లోకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు హైదరాబాద్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం..
Heavy Rains: తెలంగాణకు భారీ వర్షం సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రములోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నైరుతి దిశకు విస్తరించడంతో.. ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.
Todays Weather: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ అప్డేట్ వెలువడింది. రానున్న 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షసూచన ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.